దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్) - 2023' ప్రవేశ ప్రక‌ట‌న విడుదలైంది. దీనిద్వారా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతోపాటు, ఏడాది కాలపరిమితి ఉండే పీజీ (ఎల్‌ఎల్‌ఎం) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ కోర్సుకు ఇంటర్, పీజీ కోర్సులో ప్రవేశానికి లా డిగ్రీతో ఉత్తీర్ణత ఉండాలి. క్లాట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆగస్టు 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 18న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.



✸ కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023


కోర్సులు:


✪ అండ‌ర్‌గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రామ్ (ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)
అర్హత‌: క‌నీసం 45 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వచ్చే ఏడాది మార్చి/ ఏప్రిల్‌లో ఇంటర్ ప‌రీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు.

✪ పీజీ ప్రోగ్రామ్ (ఎల్ఎల్ఎం డిగ్రీ).
అర్హత‌: క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఎల్ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత‌. వచ్చే ఏడాది ఏప్రిల్/మేలో జరిగే లా డిగ్రీ ప‌రీక్షలు రాసేవారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
కోర్సు వ్యవధి: ఏడాది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష (క్లాట్‌-2023) ద్వారా.


దరఖాస్తు ఫీజు:  ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.3,500, ఇతరులు రూ.4,000 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

క్లాట్‌ పరీక్ష విధానం..

క్లాట్ యూజీ: 
✪ క్లాట్ యూజీ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం 150 మార్కులకుగాను 150 ప్రశ్నలకు క్లాట్‌ పరీక్ష జరుగుతుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. 
✪ క్లాట్‌ యూజీలో మొత్తం ఐదు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగం నుంచి 10శాతం(13–17) , ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 20 శాతం(28–32), లీగల్‌ రీజనింగ్‌ 20 శాతం(35–39), కరెంట్‌ అఫైర్స్‌(జనరల్‌ నాలెడ్జ్‌తో కలిపి) నుంచి 25శాతం(35–39), లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 25శాతం(28–32) ప్రశ్నలు వస్తాయి. 

పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌:
✪ పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాన్‌స్టిట్యూషనల్‌ లా 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇతర లా సబ్జెక్టులు(కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్, ఇంటర్నేషనల్‌ లా, ఎన్విరాన్‌మెంట్, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా, ఐపీఆర్‌ తదితర) నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ఉన్నత విద్య.. అత్యున్నత అవకాశాలు:
క్లాట్ ద్వారా లా డిగ్రీ పూర్తిచేసిన వారు మాస్టర్స్‌ చేయడానికి విదేశాలకు వెళ్లవచ్చు. కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, సింగపూర్‌ యూనివర్సిటీల్లో లా కోర్సుల్లో చేరడానికి వెళ్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మన దేశంలో పీజీకి సంబంధించి చాలా యూనివర్సిటీలు ఏడాది వ్యవధిగల లా ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్స్‌ పూర్తిచేసిన తర్వాత టీచింగ్‌ ఫ్యాకల్టీగా పనిచేయవచ్చు. 

న్యాయ విద్య పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలకు కొదవ లేదు. లా కోర్సులు ఉత్తీర్ణులైన తర్వాత లీగల్‌ అడ్వైజర్, అడ్వకేట్, లీగల్‌ మేనేజర్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లాంటి ఉపాధి అవకాశాలు పొందవచ్చు. సివిల్, క్రిమినల్, వినియోగదారుల చట్టాలు, మనవ హక్కులు, పన్నులు, కంపెనీ లా, మేథో సంపత్తి చట్టాలు, రాజ్యాంగం తదితర అంశాల్లో నైపుణ్యాన్ని సంపాదిస్తే.. ఆయా రంగాల్లో వచ్చే కేసుల ద్వారా కెరీర్‌ పరంగా మంచి పేరు, ఆదాయ పరంగా లబ్ధిపొందవచ్చు. ఇక్కడ కేసులు, వాదన అనుభవం ఆధారంగా ఫీజు లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు...


✦ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.08.2022


✦ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 13.11.2022.


✦ క్లాట్ ప‌రీక్ష తేది: 18.12.2022 (మ. 2గం. - సా. 4 గం.)


 


Notification & Application


 


Also Read:


TS EAMCET Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?


హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్, ఏకంగా రూ.1.30కోట్ల స్కాలర్‌షిప్!!


బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!


పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌


పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..