చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్‌), స్కూల్ ఫర్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ఇన్ పెట్రో కెమికల్స్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా (మెకానికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, పాలిమర్, ప్లాస్టిక్స్) లేదా ఐటీఐ (ఫిట్టర్/ టర్నర్/ మెషినిస్ట్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 03 వరకు అవకాశం ఉంది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో సీటు కేటాయిస్తారు.


కోర్సు వివరాలు..


* స్కిల్ డెవలప్‌మెంట్ కోర్స్‌ ఆన్‌ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్


సీట్ల సంఖ్య: 12.


అర్హత: డిప్లొమా (మెకానికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, పాలిమర్, ప్లాస్టిక్స్) లేదా ఐటీఐ (ఫిట్టర్/ టర్నర్/ మెషినిస్ట్) ఉత్తీర్ణులై ఉండాలి.


వ్యవధి: 4 నెలలు.


రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200.


ఎంపిక విధానం: ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో సీటు కేటాయిస్తారు.


దరఖాస్తు పంపాల్సిన చిరునామా: Director & H, CPET- SARP- ARSTPS, TVK Industrial Estate, Guindy, Chennai.


ముఖ్యమైనతేదీలు..


దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:  03.08.2023.


కోర్సు ప్రారంభం: ఆగస్టు రెండో వారం.


Notification

Website



ALSO READ:


జులై 24 నుంచి ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ జులై 24 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తికాగా, జులై 16న సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. మొద‌టి విడత కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థుల‌ు జులై 23లోగా సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం జులై 24 నుంచి రెండో విడత  కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. విద్యార్థులు జులై 24, 25 తేదీల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజును చెల్లించి, స్లాట్ బుకింగ్‌ చేసుకోవాలి. వీరికి జులై 26న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. 
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


ఇంటర్‌ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఇదే చివరి అవకాశం!
ఏపీలోని జూనియర్ కళాశాలల్లో మూడో విడత ప్రవేశాల గడువును అధికారులు పొడిగించారు. 2023-24 ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఆగస్టు 17తో ముగియనుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలు పొందడానికి ఇదే చివరి విడత అని.. మరోసారి గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మే 15 నుంచి జూన్‌ 14 వరకు మొదటి విడత ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జరిగింది. జూన్‌ 14తో మొదటి విడత ప్రవేశాలు, జులై 15 వరకు రెండో విడత ప్రవేశాలు జరిగాయి. ప్రస్తుతం చివరి విడత ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును ప్రారంభించిన కేంద్రం, 9 బాషల్లో ఉచిత ఆన్‌లైన్ శిక్షణ!
కేంద్రప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇండియా 2.0 లో భాగంగా ఉచిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI కోర్సును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌‌కు సంబంధించి ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. స్కిల్ ఇండియా, జీయూవీఐ మధ్య పరస్పర సహకారంతో ఈ కార్యక్రమానికి రూపొందించారు. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, గుజరాతీ, హిందీతోపాటు ఇంగ్లిష్‌లో ఈ కోర్సును అందుబాటులో తీసుకొచ్చారు. ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కోర్సును ప్రారంభిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే బోధన ఉంటుంది. 
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial