TS EAPCET 2024 Counselling Schedule: తెలంగాణలో ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న కౌన్సెలింగ్‌ షెడ్యూలులో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. జూన్ 27 నుంచి ప్రారంభంకావాల్సిన మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 4కి వాయిదాపడింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త షెడ్యూలులో భాగంగా విద్యార్థులు జులై 4 నుంచి 12 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత జులై 6 నుంచి 13 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు జులై 8 నుంచి 15 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వీరికి జులై 19న మొదటి దశ ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు జులై 19 నుంచి 23 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 26 నుంచి ప్రారంభంకానుంది. జులై 27న రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపట్టనున్నారు. ఇది పూర్తయిన విద్యార్థులు జులై 27, 28 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 31న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు జులై 31 నుంచి ఆగస్టు 2 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.  ఇక చివరి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఆగస్టు 8 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. విద్యార్థులకు ఆగస్ట్‌ 9న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్‌‌ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆప్షన్లు పూర్తిచేసుకున్న వారికి జులై 13న సీట్లను కేటాయించనున్నారు. ఆగస్టు 21 నుంచి కన్వీనర్‌ కోటా ఇంటర్నల్‌ స్లైడింగ్‌ ఉండనుంది.


తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు మే 7 నుంచి 11 వరకు టీజీ ఈఏపీసెట్‌ నిర్వహించగా.. మే 18న ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 74.98 శాతం, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 89.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా బీఈ/ బీటెక్‌/ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులు ఈఏపీసెట్‌ 2024తో పాటు ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ సబ్జెక్టులు జనరల్‌ 45%, ఇతరులు 40% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. తొలిదశ జులై 4 నుంచి 23 వరకు, రెండోదశ జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు, తుదిదశ ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగనుంది.


ప్రవేశాలు కల్పించే ఇంజినీరింగ్ కోర్సులు: బీఈ/ బీటెక్‌, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (బయో-టెక్నాలజీ), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (ఎంపీసీ), ఫార్మ్-డి (ఎంపీసీ).


ప్రవేశాలు కల్పించే అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సులు: బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ(ఫారెస్ట్రీ), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌,  బీఎఫ్‌ఎస్సీ, బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (బైపీసీ), ఫార్మ్-డి (బైపీసీ).


తొలిదశ కౌన్సెలింగ్ షెడ్యూలు
➥ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌: 04-07-2024 నుంచి 12-07-2024 వరకు.
➥ ధ్రువపత్రాల పరిశీలన: 06-07-2024 నుంచి 13-07-2024 వరకు.
➥ ఆప్షన్ల ఎంపిక: 08-07-2024 నుంచి 15-07-2024 వరకు.
➥ ఆప్షన్ల ఫ్రీజింగ్‌: 15-07-2024.
➥ సీట్ల కేటాయింపు: 19-07-2024
➥ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: 19-07-2024 నుంచి 23-07-2024 వరకు.


రెండో దశ కౌన్సెలింగ్ షెడ్యూలు
➥ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌: 26-07-2024.
➥ ధ్రువపత్రాల పరిశీలన: 27-07-2024.
➥ ఆప్షన్ల ఎంపిక: 27-07-2024 నుంచి 28-07-2024 వరకు.
➥ ఆప్షన్ల ఫ్రీజింగ్‌: 28-07-2024.
➥ సీట్ల కేటాయింపు: 28-07-2024.
➥ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: 31-07-2024 నుంచి 02-08-2024 వరకు.


చివరి దశ కౌన్సెలింగ్ షెడ్యూలు
➥ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌: 08-08-2024.
➥ ధ్రువపత్రాల పరిశీలన: 09-08-2024.
➥ ఆప్షన్ల ఎంపిక: 09-08-2024 నుంచి 10-08-2024 వరకు.
➥ ఆప్షన్ల ఫ్రీజింగ్‌: 10-08-2024
➥ సీట్ల కేటాయింపు: 13-08-2024
➥ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: 13-08-2024 నుంచి 15-08-2024 వరకు.


Counselling Notification


Website