C-DAC PG Diploma Courses: పుణెలోని 'సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్' (C-DAC) సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న శిక్షణ కేంద్రాల్లో ఆగస్టు 2024 బ్యాచ్‌కు సంబంధించి పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జులై 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీచేయనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు జులై 2 నుంచి 6 వరకు అందుబాటులో ఉంచనున్నారు.


దరఖాస్తు చేసుకున్నవారికి జులై 6,7 తేదీల్లో కామన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహించనున్నారు. పరీక్ష ఫలితాలను జులై 19న వెల్లడించనున్నారు. సీడాక్‌కు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబయి, నవీ ముంబయి, తిరువనంతపురం, నోయిడా, న్యూఢిల్లీ, గువాహటీ, పట్నా, సిల్చార్, భువనేశ్వర్, ఇందౌర్, జైపుర్, కరాద్‌, నాగ్‌పుర్, పుణెలలో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి.


వివరాలు..


* పీజీ డిప్లొమా కోర్సులు (ఫుల్‌ టైమ్)


సీడాక్ కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబయి, నవీ ముంబయి, తిరువనంతపురం, నోయిడా, న్యూఢిల్లీ, గువాహటీ, పట్నా, సిల్చార్, భువనేశ్వర్, ఇందౌర్, జైపుర్, కరాద్‌, నాగ్‌పుర్, పుణె.


కోర్సుల వ్యవధి: 24 వారాలు


1) పీజీ డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ 


2) పీజీ డిప్లొమా ఇన్‌ బిగ్ డేటా అనలిటిక్స్‌


3) పీజీ డిప్లొమా ఇన్‌ ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్‌


4) పీజీ డిప్లొమా ఇన్‌ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్ అండ్‌ సెక్యూరిటీ 


5) పీజీ డిప్లొమా ఇన్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ 


6) పీజీ డిప్లొమా ఇన్‌ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ 


7) పీజీ డిప్లొమా ఇన్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ 


8) పీజీ డిప్లొమా ఇన్‌ మొబైల్ కంప్యూటింగ్‌ 


9) పీజీ డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్ సెక్యూర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ 


10) పీజీ డిప్లొమా ఇన్‌ రోబోటిక్స్ అండ్‌ అలైడ్ టెక్నాలజీస్‌


11) పీజీ డిప్లొమా ఇన్‌ హెచ్‌పీసీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్‌


12) పీజీ డిప్లొమా ఇన్‌ ఫిన్‌టెక్ అండ్‌ బ్లాక్‌చెయిన్ డెవలప్‌మెంట్


13) పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్స్


14) పీజీ డిప్లొమా ఇన్‌ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ ప్రోగ్రామింగ్‌ పీజీ డిప్లొమా


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 


దరఖాస్తు ఫీజు: కేటగిరీ-1 కోర్సులకు(A+B) రూ.1550, కేటగిరీ-1 కోర్సులకు(A+B+C) రూ.1750 చెల్లించాల్సి ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక ప్రక్రియ: కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా.


పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, ఔరంగాబాద్, బెంగళూరు, భిలాయ్, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, ఇంపాల్, ఇండోర్, జైపూర్, కరాడ్, కొచ్చి, కొల్హాపూర్, కోల్‌కతా, లక్నో, మొహాలీ, ముంబయి, నాగ్‌పూర్, నాసిక్, నేవీ ముంబై, న్యూఢిల్లీ, నోయిడా, పాట్నా, ప్రయాగ్‌రాజ్, పూణే, రాంచీ, సిల్చార్, సోలాపూర్, శ్రీనగర్, తిరువనంతపురం, వారణాసి, విజయవాడ.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు గడువు తేదీ: 26.06.2024.


➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ తేదీలు: 02 - 06.07.2024 వరకు.


➥ కామన్ అడ్మిషన్ టెస్ట్ తేదీలు: 06, 07.07.2024.


➥ పరీక్ష ఫలితాల వెల్లడి: 19.07.2024.


➥ కోర్సులు ప్రారంభం: 29.08.2024.


Notification


Online Registration


Website




మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..