CBSE Exams Date Sheet: సీబీఎస్‌ఈ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూలును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. పరీక్షల తేదీల్లో కొన్నిమార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని సబ్జెక్టుల పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రివైజ్ చేసిన పరీక్షల తేదీల (CBSE Exams Time Table)ను విడుదల చేసింది. మారిన షెడ్యూలు ప్రకారం.. సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి, ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్ పేపర్‌ను ఫిబ్రవరి 28కి మార్చారు. మార్చి 4, 5 తేదీల్లో జరగాల్సిన టిబెటన్, ఫ్రెంచ్ పరీక్షలను ముందుకు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 20న ఫ్రెంచ్, ఫిబ్రవరి 23న టిబెటన్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సంబంధించి కేవలం ఫ్యాషన్ స్టడీస్ సబ్జెక్టు పరీక్ష తేదీ మాత్రమే మారింది. మార్చి 11న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 21కి మార్చారు. పదోతరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ షీట్‌లను రూపొందించినట్లు పరీక్షల కంట్రోలర్ డా.సన్యం భరద్వాజ్ గతంలో వెల్లడించారు.
సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షల మారిన షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల మారిన షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
తెలంగాణ పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు ఇదే! క్వశ్చన్ పేపర్ ఇలా!
తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యలూ కోసం క్లిక్ చేయండి..
ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదలైంది. గురువారం (డిసెంబరు 14) మధ్యాహ్నాం విజయవాడలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో సాధారణ ఎన్నికలు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి నెలలోనే పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 31 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..