CBSE Supplementary Exams Date Sheet: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జూన్ 7న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జులై 15 నుంచి 22 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పదోతరగతి విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకొనేందుకు రెండు సబ్జెక్టులను సప్లిమెంటరీలో భాగంగా రాసుకొనేందుకు వెసులు బాటు కల్పించిన బీసీసీఐ అధికారులు.. 12వ తరగతి విద్యార్థులకు ఒక సబ్జెక్టులో మాత్రమే అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జులై 15న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 12వ తరగతి సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు.
పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..
12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..
ఈ ఏడాది సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలకు 22 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో మొత్తం 93.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 2.12లక్షల మందికి 90 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 47,983 మంది 95శాతానికి పైగా స్కోరు సాధించారు. అత్యధికంగా తిరువనంతపురంలో 99.75 శాతం, విజయవాడలో 99.60 శాతం, చెన్నైలో 99.30 శాతం, బెంగళూరులో 99.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 0.48 శాతం పెరుగుదల నమోదైంది. బాలుర కంటే బాలికలు 2.04 శాతం పాయింట్లతో పైచేయి సాధించారు. 12వ తరగతి బోర్డు పరీక్షలోల్ల మొత్తం 87.98 శాతం ఉత్తీర్ణ సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 91.52. కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 85.12 శాతంగా ఉంది. బాలుర కంటే 6.40 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే 0.65 శాతం పెరుగదల నమోదైంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 16,33,730 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 16,21,224 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసినవారిలో 14,26,420 మంది ఉత్తీర్ణులయ్యారు. 12వ తరగతిలో మొత్తం 87.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 91.52 శాతం ఉత్తీర్ణత సాధించగా, 85.12 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. 1.16 లక్షల మంది విద్యార్థులకు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు రాగా.. ఇందులో 24,068 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోరు సాధించడం విశేషం. ఫలితాల్లో అత్యధికంగా తిరువనంతపురం-99.91%, విజయవాడ-99.04%, చెన్నై-98.47%, బెంగళూరు-96.95% ఉత్తీర్ణత సాధించారు.
వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు పరీక్షలు..
సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకురానుంది. ఇందులో భాగంగా ఏడాదికి రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని వచ్చే ఏడాది (2025-26 విద్యాసంవత్సరం) నుంచి అమలు చేయనున్నారు. దీనికనుగుణంగా సెమిస్టర్ విధానాన్ని పాటించకుండా, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై కసరత్తు చేస్తోంది. యూజీ కోర్సుల్లో ప్రవేశాలపై ప్రభావం లేకుండా పరీక్షలు నిర్వహించే విధంగా నూతన విద్యా క్యాలెండర్‌ను రూపొందించే పనిలో సీబీఎస్‌ఈ నిమగ్నమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు.