CBSE Exam Admit Card 2024: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫిబ్రవరి 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను సంబంధిత పాఠశాలల నుంచి పొందవచ్చు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ప్రైవేటు విద్యార్థుల అడ్మిట్ కార్డులను కూడా సీబీఎస్‌ఈ విడుదల చేసింది.


హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..


➥హాల్‌టికెట్ల కోసం విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.-  cbse.gov.in.


➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Main website' టాబ్ మీద క్లిక్ చేయాలి.


➥ క్లిక్ చేయగానే వచ్చే పేజీలో సీబీఎస్‌ఈ క్లాస్-10, 12 పరీక్షల హాల్‌టికెట్లకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి. 


➥విద్యార్థులు తమ వివరాలు నమోదుచేయగానే పరీక్ష హాల్‌టికెట్లు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.


➥ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని పరీక్షల సమయంలో వెంటతీసుకెళ్లాలి. 


సీబీఎస్‌ఈ క్లాస్-10, 12 పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


సీబీఎస్‌ఈ ప్రైవేట్ విద్యార్థుల పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


సీబీఎస్సీ బోర్డ్‌ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 15 మార్చి 13 వరకు పదోతరగతి పరీక్షలు, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వ‌ర‌కు 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు ప్రైవేటుగా పరీక్ష రాస్తున్న వారి అడ్మిట్‌ కార్డులను విడుదల చేశారు.


సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


కాగా, ప‌రీక్షకు ప‌రీక్షకు మ‌ధ్య గ్యాప్ ఇవ్వడంతోపాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ ప‌రీక్షల తేదీల‌ను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను రూపొందించారు. సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి, ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్‌ పేపర్‌ను ఫిబ్రవరి 28కి మార్చారు. మార్చి 4, 5 తేదీల్లో జరగాల్సిన టిబెటన్‌, ఫ్రెంచ్‌ పరీక్షలను ముందుకు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 20న ఫ్రెంచ్‌, ఫిబ్రవరి 23న టిబెటన్‌ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సంబంధించి కేవలం ఫ్యాషన్‌ స్టడీస్‌ సబ్జెక్టు పరీక్ష తేదీ మాత్రమే మారింది. మార్చి 11న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 21కి మార్చారు. పదోతరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది.


స్పోర్ట్స్, ఒలింపియాడ్‌ విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు..
జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో, అంతర్జాతీయ ఒలింపియాడ్‌లలో పాల్గొంటూ సీబీఎస్‌ఈ(CBSE) 10, 12 తరగతుల పరీక్షలు రాయలేని విద్యార్థుల కోసం సీబీఎస్ఈ బోర్డు ప్రత్యేక పరీక్షలను నిర్వహించాలని కూడా కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం రాతపరీక్షలకు మాత్రమే వర్తిస్తుంది. కంపార్ట్‌మెంట్, ప్రాక్టికల్స్‌కు ప్రత్యేకంగా పరీక్షలను మాత్రం అందరితో కలిపే రాయాల్సి ఉంటుంది. క్రీడలు, ఎడ్యుకేషన్ పోటీల్లో పాల్గొనేలా యువతను ప్రోత్సహించేందుకే విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఇక ఏడాదికి రెండుసార్లు..
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల విధానంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(Central Board Of Secondary Education) కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే పరీక్షలను రెండుసార్లు రాయాలా లేదా ఎప్పటిలా ఒకేసారి రాయాలా అనేది విద్యార్ధుల ఇష్టమని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఐచ్ఛికం. విద్యార్థులు రెండు సార్లు తప్పనిసరిగా రాయాలన్న నిర్భంధమేమీ లేదని తెలిపింది. ఒకవేళ రెండు సార్లు పరీక్షలు రాస్తే.. ఎందులో ఎక్కువ మార్కులు వస్తే.. ఆ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. 


ఒత్తిడి తగ్గించేందుకే..
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ ​తెలిపింది. సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దాంతో పాటూ రెండు సార్లు పరీక్షలు రాయడం వలన విద్యార్ధులు పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయ్యే ఛాన్స్ఉంటుంది. దానివలన వారికి స్కోర్ కూడా ఎక్కువ వస్తుంది. అదే మొదటిసారిలోనే మంచి మార్కులు వస్తే రెండో సారి రాయక్కర్లేదు కూడా. దీనివలన ఏడాది మొత్తం ఒత్తిడి కూడా ఉండదని చెబుతున్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...