CBSE Term 2 10th, 12th Practical Exams 2022; సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్ 2 ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు ప్రాక్టికల్స్ మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. థియరీ ఎగ్జామ్స్ ప్రారంభానికి 10 రోజుల ముందే ప్రాక్టికల్స్ ముగుస్తాయని చెప్పారు. సీబీఎస్ఈ టర్మ్ 2 ఎగ్జామ్స్ ఏప్రిల్ 26న ప్రారంభం కానున్నాయి.
కోవిడ్-19 ప్రోటోకాల్స్ తప్పనిసరి..
స్కూల్స్ కోవిడ్-19 ప్రోటోకాల్‌లను పాటిస్తూ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలి. ఒకేచోట విద్యార్థులు ఎక్కువగ కాకుండా భౌతికదూరం పాటించేలా చూడాలని సీబీఎస్ఈ సూచించిందివ. 10 మంది విద్యార్థులను కలిపి ఓ గ్రూపుగా చేసి పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ఫస్ట్ ఓ 10 మంది విద్యార్థులు ల్యాబ్ పనికి హాజరు అయితే, మిగతా విద్యార్థులు పెన్ మరియు పేపర్ వర్క్ చేయాలని పాఠశాలలకు సూచించింది.
ప్రైవేట్ అభ్యర్థులకు నో ప్రాక్టికల్స్
10వ తరగతి రెగ్యులర్ విద్యార్థులకు ఇంటర్నల్ ఎగ్జామ్స్‌ను అదే స్కూల్ వాళ్లు నిర్వహిస్తారు. 12వ తరగతి రెగ్యులర్ అభ్యర్థుల ప్రాక్టికల్ పరీక్షలను బయటి నుంచి వచ్చే ఎగ్జామినర్ల (External Examiners For Class 12 Exams) ద్వారా నిర్వహించారు. ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించి స్కూల్స్ ఆ మార్కులను మార్చి 2 నుండి రోజువారీ ప్రాతిపదికన అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్‌గా పరీక్ష రాయనున్న అభ్యర్థులు 10వ మరియు 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షకు హాజరు కానవసరం లేదు. సీబీఎస్ఈ నిర్వహించే థియరీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.
సీబీఎస్ఈ మార్గదర్శకాలు
2020-21 సెషన్‌కు ముందు, అంటే 2019-20 మరియు అంతకు ముందు పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సంబంధించి థియరీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రాక్టికల్ పరీక్షలు/ ప్రాజెక్ట్/ ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లకు మార్కులు కేటాయించాలని సీబీఎస్ఈ మార్గదర్శకాలలో పేర్కొంది. టర్మ్ 2 పరీక్షల తేదీలను పూర్తి డేట్‌షీట్‌ను CBSE త్వరలో విడుదల చేయనుంది. టర్మ్-2 పరీక్షలలో, విద్యార్థులు ఆబ్జెక్టివ్ మరియు సబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
టర్మ్ 2 పరీక్షల తేదీలను పూర్తి డేట్‌షీట్‌ను CBSE త్వరలో విడుదల చేయనుంది. టర్మ్-2 పరీక్షలలో, విద్యార్థులు ఆబ్జెక్టివ్ మరియు సబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/ లో చెక్ చేసుకోవాలని సూచించారు.
Also Read: SSC CHSL 2022 Exam: ఇంటర్ పాసయ్యారా? గుడ్‌న్యూస్- 5 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్