CBSE Term 1 Exams: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) గురువారం నాడు టెన్త్, 12వ తరగతి విద్యార్థుల టర్మ్ 1 ఎగ్జామ్స్ మైనర్ సబ్జెక్టుల డేట్ షీట్స్ విడుదల చేసింది. టెన్త్ విద్యార్థులకు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 7 వరకు మైనర్ సబ్జెక్టుల పరీక్షలు నిర్వహిస్తారు. మరికొన్ని రోజుల్లో సీబీఎస్ఈ ఎగ్జామ్స్ ప్రారంభం కానుండగా విద్యార్థులకు బోర్డు పలు సూచనలు చేసింది. 


సిలబస్ చెక్ చేసుకోండి..
సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ లో సిలబస్ చెక్ చేసుకోవాలి. మరో నెల రోజులు కూడా సమయం లేనందున ప్రిపరేషన్ లో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి. టర్మ్ 1 లో పేర్కొన్న సిలబస్ ఛాప్టర్లను మాత్రమే విద్యార్థులు చదువుకోవాలని సూచించారు. మీరు ఇప్పటివరకూ చదవని ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలి. టెన్త్, 12వ తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ అధికారికంగా చెప్పిన శాంపిల్ పేపర్లలోని ఎంసీక్యూస్ ప్రిపేర్ కావాలి.


Also Read: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్ క్రాకర్
టీచర్లు ఇచ్చిన లైవ్ వీడియోలు చెక్ చేసి జాగ్రత్తగా అన్ని అంశాలపై ఫోకస్ చేయాలి. అధికారిక వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన లింక్ http://www.cbseacademic.nic.in/web_material/Circulars/2021/88_Circular_2021.pdf . ఎంసీక్యూస్ చదవడం ద్వారా విద్యార్థులకు సబ్జెక్టుపై లోతైన అవగాహన వస్తుంది. ఎగ్జామ్ పేపర్ విధానంపై ఆందోళన తగ్గుతుంది. 


10, 12వ తరగతి ఎగ్జామ్స్‌కు సంబంధించి ఓస్వాల్ సీబీఎస్ఈ శాంపిల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్, అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడూ సేకరించాలి. కేస్ బేస్డ్, రీజనింగ్ అసర్షన్, స్టాండ్ అలోన్ తీరుపై ఫోకస్ చేయాలి. ఇందుకోసం పరీక్షలను రెండు టర్మ్‌లుగా విభజించి నిర్వహిస్తున్నారు. 


ప్రతి సబ్జెక్ట్ క్షుణ్ణంగా ప్రిపేర్ కావాలని సీబీఎస్ఈ బోర్డ్ విద్యార్థులకు సూచించింది. ఛాప్టర్లను సులువైనవి, మధ్యస్తంగా, డిఫికల్ట్ అని మూడు రకాలుగా విభజించుకోవాలి. మార్కుల వెయిటేజీ ఆధారంగా ఛాప్టర్లు చదవితే బెటర్. ప్రతి సబ్జెక్టును ఇలా కేటగిరిలుగా చేసుకుని చదివితే ప్రిపరేషన్ తేలిక అయి, సిలబస్ త్వరగా పూర్తవుతుంది. ఒక టాపిక్ చదివితే అందుకుస సంబంధించిన టాపిక్స్‌ను కనెక్ట్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి.


Also Read: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. తేదీలు, పూర్తి వివరాలివే


చదివామన్న కాన్ఫిడెన్స్..
360 డిగ్రీస్ ఫార్మాట్ లో ప్రిపేర్ అవ్వాలి. అన్ని అంశాలను చదివామని, అందులో ఎలాంటి డౌట్ లేదనే తీరుగా విద్యార్థులు వ్యవహరించాలి. ఎంత సమయంలో ఆన్సర్ రాయగలుగుతారో టెస్ట్ చేసుకోవడం బెటర్. ఒత్తిడి గురికాకుడదు. 


ప్రాక్టీస్ పెంచాలి.. గతంలో జరిగిన పరీక్ష పేపర్లు చదవడం ద్వారా పేపర్ పై అవగాహన పెరుగుతుంది. ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తే విద్యార్థులకు ప్రయోజనం. 


పరీక్షా హాలులో ఏం చేయాలంటే..
మీకు మొత్తం 90 నిమిషాలు ఉండగా.. అందులో తొలి 10 నిమిషాలు ఈజీ, ట్రికీ, డిఫికల్ట్ ప్రశ్నలుగా విభజించుకోవాలి. తరువాత 70 నిమిషాలు సమాధానాలు ఇవ్వడానికి కేటాయించాలి. చివరి 10 నిమిషాలు పేపర్, ఆన్సర్స్ చెక్ చేసుకోవాలి. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి