సీబీఎస్‌ఈ కంపార్ట్‌మెంట్ పరీక్షల తేదీలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెల్లడించింది. సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన పరీక్షల తేదీలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రకటించిన ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలను ఆగస్టు 23 నుంచి 29 వరకు, 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలను ఆగస్టు 23న నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. విద్యార్థులు ప్రశ్నపత్రం చదవడానికి అదనంగా 15 నిమిషాల సమయం కేటాయించారు.


Also Read: బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!


సీబీఎస్‌ఈ కంపార్ట్‌మెంట్ 2022 పరీక్షలను దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు ధరించాలి. శానిటైజర్ వాడాలి. సోషల్ డిస్టెన్స్ నిబంధనల పాటించాల్సి ఉంటుంది. వీటితోపాటు అడ్మిట్‌కార్డులో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలి.

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతులు ఫలితాలను జులై 22న వెల్లడించిన సంగతి తెలిసిందే. 10వ తరగతిలో 92.71% ఉత్తీర్ణులు కాగా, 12వ తరగతిలో 94.40% ఉత్తీర్ణత సాధించారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన తాజాసమాచారం తెలుసుకోవచ్చు.  


CLASS-X DATE SHEET


CLASS-XII DATE SHEET 



పరీక్షల తేదీలను ఇలా చూసుకోండి..



  • అభ్యర్థులు మొదటగా సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ cbse.gov.in సందర్శించాలి.



  • అక్కడ హోంపేజీలో కనిపించే ‘Main website’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.



  • అలా క్లిక్ చేయగానే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.



  • తర్వాత ‘Date sheet of compartment examination August-2022’, సెక్షన్ కనిపిస్తుంది.



  • దానిపై క్లిక్ చేయగానే 10, 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ కనిపిస్తుంది.



Also Read: పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌


పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలివే..



  • అభ్యర్థులు శానిటైజర్ తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాలి. 



  • అభ్యర్థులు ముక్కు, నోరు కవర్ అయ్యేలా మాస్కులు ధరించాలి. 



  • అభ్యర్థులు సోషల్ డిస్టెన్స్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. 



  • కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు మార్గనిర్దేశం చేయాలి. 



  • తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలి. 



  • పరీక్షా కేంద్రాలకు హాజరైనప్పుడు జారీ చేయబడిన అన్ని సూచనలను అభ్యర్థులు కచ్చితంగా పాటించాలి.



  • అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లో ఇచ్చిన అన్ని సూచనలను పాటించాలి. 



  • ప్రతి పరీక్షకు మధ్య వ్యవధి టైమ్ టేబుల్, అడ్మిట్ కార్డ్‌లో ఇచ్చిన విధంగా ఉంటుంది.



  • విద్యార్థులు ప్రశ్నపత్రం చదవడానికి వీలుగా అదనంగా 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. 



  • తాజా సమాచారం కోసం విద్యార్థులు ఎప్పటికప్పుడు www.cbse.gov.in చూస్తుండాలి.


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..