CBSE 12వ తరగతి ఫలితాలు: కేంద్ర విద్యాశాఖ సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది 88.39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇది గత సంవత్సరం కంటే 0.41 శాతం ఎక్కువ అని అధికారులు తెలిపారు. విద్యార్థులు CBSE అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవాలని సూచించారు.
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు చెక్ చేసుకునేందుకు ఈ లింక్ CBSE Exam Results 2025 మీద క్లిక్ చేయండి
విజయవాడ 99.60 శాతం ఉత్తీర్ణత శాతంతో అన్ని ప్రాంతాలలో అగ్రస్థానంలో నిలిచింది, తరువాత తిరువనంతపురం, చెన్నై మరియు బెంగళూరు ఉన్నాయి. ఢిల్లీ పశ్చిమ ఐదవ ర్యాంక్‌ను సొంతం చేసుకోగా.. తూర్పు ఢిల్లీ ఆరవ స్థానంలో నిలిచింది.
CBSE 12వ తరగతి బోర్డు పరీక్షల్లో బాలికలు బాలుర కంటే 5 శాతం పాయింట్లకు పైగా అధిక మార్కులు సాధించారని ఎగ్జామ్ కంట్రోలర్ సంయం భరద్వాజ్ తెలిపారు. 1.15 లక్షలకు పైగా విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించారు మరియు 24,000 మందికి పైగా అభ్యర్థులు 95 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించారు. 1.29 లక్షలకు పైగా అభ్యర్థులు కంపార్ట్‌మెంట్‌లో ఉన్నారు.