Brahmamudi Serial Today Episode:  దుగ్గిరాల ఇంటికి రాజ్‌ను తీసుకుని వచ్చిన యామినిని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఎవ్వరూ కూడా పలకరించరు. దీంతో ఎందుకు అందరూ అలా చూస్తున్నారు. కళావతి షాక్‌ అవుతుందనుకుంటే మీరందరూ షాక్‌ అయ్యారేంటి అంటుంది యామిని.

యామిని:  నేను ఎవరో అని చూస్తున్నారా..? నేను కళావతి ఫ్రెండ్ ను నిజం చెప్పాలంటే మా బావ రామ్‌ తనకు ఫ్రెండ్‌ మా మొదటి పెళ్లి పత్రిక కళావతికి ఇవ్వాలని వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఇంత మంది పెద్దవాళ్లు ఉండగా కళావతికి ఇవ్వడం ఎందుకు పెద్దవాళ్లకే ఇస్తాను. బావ ఇటురా అమ్మమ్మ మమ్మల్ని ఆశీర్వదించండి.

ఇందిరాదేవి:  దీర్ఘాయుష్సుమాన్‌భవ

యామిని:  మేము సడెన్‌ గా వచ్చే సరికి షాక్‌ లో ఉన్నారనుకుంటా..? దీర్ఘసుమంగళిభవ అనాలి.. మీరు దీర్ఘాయుష్సుమాన్‌భవ అంటున్నారు.

రుద్రాణి:  పర్వాలేదులే యామిని దీర్ఘ ఆయుష్సుతో ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు

యామిని: కరెక్టుగా చెప్పారు ఆంటీ మీరు కూడా మా పెళ్లికి తప్పకుండా రావాలి.

రుద్రాణి:  అయ్యో ఎందుకు రాము ఇంటికి వచ్చి పిలిచాక తప్పకుండా వస్తాము.

ఇంతలో అక్కడకు అపర్ణ వస్తుంది. అపర్ణను చూసిన రాజ్‌ షాక్‌ అవుతాడు.

రాజ్‌: మీరు…

యామిని:  మీరు ఆరోజు గుడిలో అన్నదానం చేసేటప్పుడు బర్తుడే కేక్‌ తీసుకొచ్చి సెలబ్రేట్‌ చేశారు కదా..? ఆవిడే ఈవిడ కదా..? మీకు కళావతికి ఏంటి సంబంధం.. మీరు ఈ ఇంట్లో ఎందుకు ఉన్నారు..?

రుద్రాణి: అదేంటి అలా అడుగుతున్నావు.. మా వదిన ఈ ఇంటికి పెద్ద కొడలు.. తన ఇంట్లో తను ఉండకుండా ఇంకెక్కడ ఉంటుంది.

యామిని: మరి కళావతికి తనకి ఏంటి సబంధం

రుద్రాణి:  ఇది మరీ బాగుంది. వాళ్లిద్దరూ అత్తాకోడళ్లు కాబట్టే కలిసి ఉన్నారు.

యామిని: మరి గుడిలో ఇద్దరూ ఏ సంబంధం లేనట్టు ఎందుకు నటించారు.. నేను చెప్పాలా..? బావ.. వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు బాగా తెలుసు కానీ ఎమీ తెలియనట్టు నీ ముందు నటించారు. నిన్ను మోసం చేశారు

ఇందిరాదేవి: చాల్లే ఆపు మోసం చేయాల్సిన అవసరం నా కోడలుకు లేదు.

యామిని: చూశావా బావ వీళ్ల నాటకాలు.. నిన్ను వాళ్ల వైపుకు తిప్పుకోవడానికి రిసార్ట్స్‌  నాటకం ఆడారు. కానీ నువ్వు కళ్లు తిరిగి పడిపోయేసరికి భయపడి పారిపోయారు. అప్పుడు నేను ఒక్కదాన్నే నిన్ను హాస్పిటల్‌ కు తీసుకెళ్లి కాపాడుకున్నాను బావ. కానీ నువ్వు మాత్రం కళ్లు తెరవగానే కళావతి రాలేదా..? అని అడిగావు… ఇప్పటికైనా అర్తం అయిందా బావ ఎవరు మోసగాళ్లో ఎవరు మంచోళ్లో

కావ్య:  ఏవండి తన మాటలు నమ్మకండి.. తను చెప్పేవన్నీ అబద్దాలే.

రాజ్‌:  నేను మిమ్మల్ని ఒకే మాట అడుగుతాను. ఆవిడ మీకు ముందే తెలుసా..? ఆవిడకు మీకు ముందే పరిచయం ఉందా…

కావ్య: ఉంది..

రాజ్‌ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

యామిని:  నా ప్రేమ నిజమైంది కాబట్టి ఆ దేవుడు నాకే సపోర్టు చేశాడు. మీ ఇద్దరి మధ్య ముడిపడింది దాన్ని ఎవ్వరూ విడదీయలేరని అంటుంటావు కదా ఆ ముడిని విడదీశాను. ఇక గుడ్‌బై

అని యామిని వెళ్లిపోతుంది. కావ్య ఏడుస్తూ పైకి వెళ్లిపోతుంది. రుద్రాణి, రాహుల్‌ హ్యాపీగా ఫీలవుతారు.  తర్వాత అపర్ణ, ఇందిరాదేవి ప్లాన్‌ ప్రకారం కళ్యాణ్‌ చేత రాజ్‌కు ఫోన్‌ చేయిస్తారు. కావ్య గురించి ఒక విషయం మాట్లాడాలి కలవాలి అని చెప్తాడు కళ్యాణ్‌. సరే కలుద్దామని ఎక్కడని రాజ్‌ అడుగుతాడు. లోకేషన్‌ షేర్‌ చేస్తానని కళ్యాణ్‌ చెప్తాడు. మరోవైపు యామిని కావ్యకు ఫోన్‌ చేసి రాజ్‌కు నువ్వు ఎంత దగ్గరైనా చివరకు దూరం అవ్వాల్సిందే.. అత్తయ్యను దాచేస్తే మోసం అవుతుందని తెలియదా నీకు అంటూ తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!