CBSE 10th Result 2022: పదో తరగతి టర్మ్ 2 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE Class 10 Result 2022) టెన్త్ విద్యార్థుల టర్మ్ 2 ఫలితాల విడుదలకు అంతా సిద్ధం చేసింది. గత అకడమిక్ ఇయర్‌లో 10వ తరగతి పరీక్షలను టర్మ్ 1, టర్మ్ 2లుగా నిర్వహించారు. తద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని బోర్డ్ భావించింది. టర్మ్ 1 ఫలితాలను ఏప్రిల్ నెలలో విడుదల చేసిన సీబీఎస్‌ఈ బోర్డ్ నేడు 10వ తరగతి విద్యార్థుల టర్మ్ 2 ఫలితాలు విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్ https://cbseresults.nic.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవాలని విద్యార్థులకు బోర్డ్ సూచించింది.
పాఠశాలల్లో ఇప్పటికే ఇంటర్నల్ అసెస్‌మెంట్/ప్రాక్టికల్ స్కోర్లు అందుబాటులో ఉన్నందున, థియరీ పరీక్షలకు సంబంధించిన స్కోర్‌లు మాత్రమే తెలియజేస్తున్నట్టు సీబీఎస్‌ఈ (CBSE) పేర్కొంది. సీబీఎస్‌ఈ(CBSE) టర్మ్ 1, టర్మ్ 2 ఫలితాలతో విద్యార్థులు సింగిల్ కంబైన్డ్ మార్క్ షీట్ పొందుతారు. 2022కి సంబంధించిన మార్క్ షీట్‌లు 2021 లేదా అంతకు ముందు సంవత్సరం తరహాలోనే కనిపిస్తాయి. టర్మ్ 1, టర్మ్ 2, ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా తుది ఫలితాన్ని బోర్డు ప్రకటిస్తుంది.
స్కూళ్లకు విద్యార్థుల మార్కుల అప్ డేట్..
సీబీఎస్ఈ 10వ తరగతికి సంబంధించిన స్కూల్ కోడ్ సెషన్ 2021-22కి సంబంధించిన టర్మ్ 2 పరీక్ష పనితీరును అటాచ్‌మెంట్‌లో చూసుకోవాలని సీబీఎస్‌ఈ(CBSE) రిపోర్ట్‌లో పేర్కొంది. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్‌లలో 10వ తరగతి టర్మ్ 2 ఫలితాలను cbse.gov.in cbseresults.nic.in , cbse.gov.in, results.nic.in లలో చెక్ చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ కింది వెబ్‌సైట్‌లలో సీబీఎస్‌ఈ టర్మ్ 2 ఫలితాలు తెలుసుకోవచ్చు.
cbseresults.nic.in
results.gov.in
digilocker.gov.in
వెబ్‌సైట్‌లో నమూనా పత్రాలు, మోడల్ పేపర్స్
బోర్డు పరీక్ష ఫలితాలు, నమూనా పత్రాలు మరియు ఇతర వివరాలను సింగిల్ విండోలో అప్‌డేట్ చేయడానికి CBSE బోర్డు ఫలితాలకు ముందు 'పరీక్ష సంగమ్' అనే పోర్టల్‌ను ప్రారంభించారు. సీబీఎస్ఈ నిర్వహించిన టర్మ్ 2 నమూనా పేపర్, మార్కింగ్ విధానం పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచింది. 10వ తరగతి టర్మ్ 1 ఎగ్జామ్స్ మోడల్ పేపర్స్‌ను సీబీఎస్ఈ ఇదివరకే విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbseacademic.nic.inలో పూర్తి వివరాలు చెక్ చేసుకోవచ్చు.
Also Read: ITI Course after 10th: టెన్త్ తరవాత ఐటీఐ కోర్స్ చేస్తే, ఈ కేంద్ర సంస్థల్లో జాబ్స్ కొట్టేయొచ్చు
Also Read: Diploma Course after 10th: టెన్త్ తరవాత డిప్లొమా కోర్స్ చేయొచ్చా, అవకాశాలు ఎలా ఉంటాయ్?