CBSE 10th Result 2022 Declared: పదో తరగతి టెర్మ్ వన్ ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE Class 10 Result 2022) విడుదల చేసింది. 10వ తరగతి టర్మ్ 1 పరీక్షలో విద్యార్థుల పెర్మార్మెన్స్‌ను పాఠశాలలకు తెలియజేసినట్లు సీబీఎస్‌ఈ శనివారం పేర్కొంది. పాఠశాలల్లో ఇప్పటికే ఇంటర్నల్ అసెస్‌మెంట్/ప్రాక్టికల్ స్కోర్లు అందుబాటులో ఉన్నందున, థియరీ పరీక్షలకు సంబంధించిన స్కోర్‌లు మాత్రమే తెలియజేస్తున్నట్టు సీబీఎస్‌ఈ (CBSE) పేర్కొంది.
స్కూళ్లకు విద్యార్థుల మార్కుల అప్ డేట్.. సీబీఎస్ఈ 10వ తరగతికి సంబంధించిన స్కూల్ కోడ్ సెషన్ 2021-22కి సంబంధించిన టర్మ్ 1 పరీక్ష పనితీరును అటాచ్‌మెంట్‌లో చూసుకోవాలని సీబీఎస్‌ఈ(CBSE) ఇమెయిల్ రిపోర్ట్‌లో పేర్కొంది. నవంబర్-డిసెంబర్ 2021లో జరిగిన టర్మ్ 1 పరీక్షల స్కోర్‌కార్డ్‌లను విడుదల చేసిన బోర్డు విద్యార్థి పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది మాత్రం వెల్లడించలేదు. విద్యార్థులు 10వ తరగతి టర్మ్ 1 ఫలితాలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in cbseresults.nic.in , cbse.gov.in, results.nic.in లలో అప్‌లోడ్ చేస్తామని, అప్పుడు యాక్సెస్ చేయవచ్చునని ఓ ప్రకటనలో తెలిపింది.
సీబీఎస్ఈ మార్క్ షీట్స్ కోసం టెన్త్ విద్యార్థులకు కావాల్సిన వివరాలు..
విద్యార్థుల పేరు, స్కూల్ పేరు ఎంటర్ చేయాలివిద్యార్థుల రోల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి
వీటి ద్వారా థియరీ సబ్టెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయి, ఆ పేపర్ మొత్తం మార్కుల వివరాలు వస్తాయి
అన్ని పరీక్షలకు కలిపి ఎన్ని మార్కులు వచ్చాయి అనే వివరాలు విద్యార్థులు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ లో తెలుసుకోవచ్చునని సీబీఎస్ఈ తెలిపింది.
CBSE టర్మ్ 2 పరీక్షల మోడల్ పేపర్స్:సీబీఎస్ఈ త్వరలో నిర్వహించనున్న టర్మ్ 2 నమూనా పేపర్, మార్కింగ్ విధానం పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 10వ తరగతి టర్మ్ 1 ఎగ్జామ్స్ మోడల్ పేపర్స్‌ను సీబీఎస్ఈ ఇదివరకే విడుదలల చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbseacademic.nic.inలో పూర్తి వివరాలు చెక్ చేసుకోవచ్చు.
Also Read; CBSE Term 2 Exams Schedule: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
Also Read: పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి