సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి ఫలితాలు కాసేపటి క్రితం విడుదల అయ్యాయి. ఈ ఏడాది 99.04 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు బోర్డు వెల్లడించింది. ఫలితాల్లో బాలికలు ముందంజలో నిలిచారు. బాలుర కంటే 0.35 శాతం అధిక ఉత్తీర్ణతను సాధించారు. బాలికల ఉత్తీర్ణతా శాతం 99.24 కాగా.. బాలుర ఉత్తీర్ణత 98.89 శాతంగా నమోదైంది. ఇంకా 16,639 మంది విద్యార్థుల ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. 


త్రివేండ్రం టాప్..


ప్రాంతాల వారీగా చేస్తే.. ఫలితాల్లో త్రివేండ్రం టాప్ ప్లేస్‌లో నిలిచింది. 99.99 శాతం ఉత్తీర్ణతను సాధించింది. రెండో స్థానాన్ని బెంగళూరు (99.96 శాతం) దక్కించుకోగా.. తర్వాతి స్థానాల్లో చెన్నై (99.94 శాతం), పుణె (99.92 శాతం), అజ్మీర్ (99.88 శాతం) ఉన్నాయి. సీబీఎస్ఈ 12 ఫలితాల మాదిరిగానే 10 ఫలితాల్లోనూ కేంద్రీయ విద్యాలయాలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. 


సీబీఎస్ఈ 10 ఫలితాలను cbseresults.nic.in, cbse.gov.in వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు. దీంతో పాటు డిజిలాకర్ (DigiLocker) యాప్, ఉమాంగ్ (UMANG) యాప్, digilocker.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసుకునేందుకు విద్యార్థులు వారి రోల్ నంబర్, స్కూల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.


ఫలితాలు లింక్‌లు ఇవే..
లింక్ 1
లింక్ 2
లింక్ 3


ఫలితాలు చెక్ చేసుకోండిలా..
1. cbseresults.nic.in. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. 
2. అందులో 'Class X Result' పై క్లిక్ చేయండి.
3. మీ రోల్ నంబర్, స్కూల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేయండి.
4. స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం దీనిని ప్రింటవుట్ తీసుకోండి. 


సీబీఎస్ఈ ట్వీట్..


సీబీఎస్ఈ 10 ఫలితాలు జూలై 20వ తేదీన విడుదల కావాల్సి ఉంది. స్కూళ్లు మార్కుల జాబితాలను పంపడంలో ఆలస్యం చేయడంతో ఫలితాల విడుదల ఆలస్యం అయింది. ఫలితాల విడుదలపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగాలను బోర్డు తెరదించింది. నేడు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. 








Also Read: క్యాట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..