CAT 2023 Results: ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్ష- కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌)-2023 ఫలితాలు డిసెంబరు 21న విడుదలయ్యాయి. ఐఐఎం లక్నో ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి తమ స్కోరుకార్డు చూసుకోవచ్చు. క్యాట్‌లో సాధించిన పర్సంటైల్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్‌ స్కోరు ఆధారంగా ఐఐఎంలే కాకుండా పేరున్న కళాశాలలు కూడా తమ కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తాయి. దేశవ్యాప్తంగా మొత్తం 167 న‌గ‌రాల్లో 375 పరీక్ష కేంద్రాల్లో నవంబర్‌ 26న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 


➥ క్యాట్-2023 ఫలితాల్లో 14 మంది అభ్యర్థులకు నూటికి నూరుశాతం మార్కులు వచ్చాయి.


➥ ఫలితాల్లో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఒక్కరు 100 పర్సంటైల్‌ సాధించారు.


➥ మొత్తంగా 72 మంది టాపర్లుగా నిలవగా.. 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించారు. 


➥ 29 మందికి 99.99 పర్సంటైల్‌ వచ్చింది.


➥ 29 మందికి 99.98 పర్సంటైల్‌ వచ్చింది.


➥ 100 పర్సంటైల్‌ సాధించిన వారిలో మహారాష్ట్ర నుంచి అత్యధికంగా నలుగురు ఉండగా.. దిల్లీ, గుజరాత్‌, జమ్మూకశ్మీర్‌, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. క్యాట్ స్కోరుకు 2024 డిసెంబరు 31 దాకా వాలిడిటీ ఉంటుంది.


క్యాట్ ఫలితాలు ఇలా చూసుకోండి..


➤ మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - iimcat.ac.in


➤ అక్కడ హోంపేజీలో క్యాట్ ఫలితాలకు సంబంధించిన లింక్ కనిపిస్తుంది.


➤ అక్కడ కనిపించే లాగిన్ సెక్షన్ అభ్యర్థులు తమ తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి 'LOGIN' బటన్‌పై క్లిక్ చేయాలి.  . 


➤ కంప్యూటర్ స్క్రీన్ మీద క్యాట్ ర్యాంక్ కార్డు కనిపిస్తుంది


➤ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.


ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 


Website


రికార్డు స్థాయిలో దరఖాస్తులు..
దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లలో ప్రవేశాలకు వీలు కల్పించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2023 ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3.3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబరు 26న జరిగిన పరీక్షకు మొత్తం సుమారు 3 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. గతేడాదితో పోల్చుకుంటే 31 శాతం పెరగడం విశేషం. ఈసారి మొత్తం అభ్యర్థుల్లో 1.17 లక్షల మంది అమ్మాయిలున్నారు. ఈసారి పరీక్షను ఐఐఎం లక్నో నిర్వహించింది.


ఐఐఎం క్యాంపస్‌లు ఇవే.. 
క్యాట్ 2023 పరీక్ష ద్వారా విశాఖపట్నం, అహ్మాదాబాద్, బెంగళూరు, కలకతా, జమ్మూ, బోద్ గయ, ఉదయపూర్, తిరుచిరాపల్లి, కోజికాడ్, అమృత్‌సర్, రాయ్‌పూర్, నాగ్‌పూర్, కాశీపూర్, లక్‌నవూ, రాంచీ, రోహ్‌తక్, షిల్లాంగ్, ఇండోర్, సంబాల్‌పూర్, సిర్‌మౌర్ ఐఐఎం క్యాంపస్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. 


 క్యాట్ పరీక్ష విధానం ఇలా..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2 గంటలపాటు సాగనుంది. పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటి నుంచి 66 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాల సమయం చొప్పున 120 నిమిషాల సమయం ఉంటుంది. దివ్యాంగులకు 13 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తారు. ప్రతిప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. క్యాంట్ స్కోరుకు 2023 డిసెంబరు 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 


➥ సెక్షన్-1: వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రహెన్షన్ -  24 ప్రశ్నలు – 72 మార్కులు.


➥ సెక్షన్-2: డేటా ఇంటర్ ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్ - 20 ప్రశ్నలు – 60 మార్కులు


➥ సెక్షన్-3: క్వాంటిటేటివ్ ఎబిలిటీ - 20 ప్రశ్నలు – 60 మార్కులు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...