ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 22న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థుల మార్కులకు సంబంధించిన షార్ట్‌ మెమోలు అందుబాటులోకి వచ్చాయి. పదోతరగతి ఫలితాలకు సంబంధించి విద్యార్థుల ఫొటోతో కూడిన మార్కుల మెమోలను ఎస్‌ఎస్‌సీ బోర్డు (BSEAP) అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. విద్యార్థులు సంబంధిత పాఠశాలల ద్వారా మెమోలు పొందవచ్చు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు సంబంధించిన లాగిన్ వివరాలను నమోదుచేసి షార్ట్ మెమోలను డౌన్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిపై సంతకం చేసి విద్యార్థులకు అందజేయాలి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ ప్రవేశాల సమయంలో ఈ షార్ట్ మెమోలను ఉపయోగించుకోవచ్చు. ఒరిజినల్ మెమో మాదిరిగానే షార్ట్ మెమోలను పరిగణిస్తారు.


Direct Link: AP SSC Short Memos


ఈ ఏడాది ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6.16 లక్షలు, గతేడాది ఫెయిలై రీ ఎన్‌రోల్ అయిన విద్యార్ధులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3743 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో మొత్తం 5,34,574 (86.69 %) విద్యార్థులు అర్హత సాధించారు. ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి జూన్‌ 3 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.


పదోతరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి..


Also Read:


తెలంగాణ మోడల్ స్కూల్స్ ఫలితాలు విడుదల - మెరిట్ జాబితా, ర్యాంకులు ఇలా చూసుకోండి
TSMS Merit List: తెలంగాణలోని మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతితోపాటు, 7 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూల్స్ అడిషనల్ సెక్రటరీ రమణ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 7న మండల కేంద్రాల్లో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లలో (మొత్తంగా 19,400 సీట్లు) ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే 7-10 తరగతుల్లోని మిగిలిన సీట్లను భర్తీ చేస్తారు. ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో 50 చొప్పున విద్యార్థులు ఉంటారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 25న వెల్లడిస్తారు.  ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జూన్ 1న లేదా 2023 - 24 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు ప్రారంభిస్తారు. మోడల్‌ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ద్వారా 6, 7, 8, 9, 10తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రధానంగా 6వ తరగతిలో పూర్తిస్థాయి, 7 నుంచి 10వ తరగతుల్లో మిగిలిపోయిన ఖాళీలను భర్తీచేస్తారు. మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలు కోరే విద్యార్థుల వయసు 6వ తరగతికి-10 సంవత్సరాలు, 7వ తరగతికి-11 సంవత్సరాలు, 8వ తరగతికి-12 సంవత్సరాలు, 9వ తరగతికి-13 సంవత్సరాలు, 10వ తరగతికి-14 సంవత్సరాలు నిండిపోయాలి.  ప్రవేశ పరీక్ష ఆధారంగా. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...