అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో ప్రవేశాల కోసం జూన్ 6న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అభ్యాసక సహాయ సేవా విభాగం డైరెక్టర్ డా.ఎల్ విజయకృష్ణారెడ్డి శనివారం(జూన్ 3) ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి 12:30 గంటల వరకు బీఈడీ, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) పరీక్ష జరుగుతుందని.. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్‌టికెట్లను సంబంధిత యూనివర్సిటీ పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు.
డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 21న విడుదల చేసిన సంగతి తెలిసిందే. సాధారణ డిగ్రీతోపాటు ఇంజినీరింగ్ డిగ్రీ చదివిన అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఇంజినీరింగ్‌లో సైన్స్/ మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. రూ.500 ఆలస్య రుసుముతో మే 28 వరకు దరఖాస్తులు స్వీకరిచింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఫీజుగా రూ.1000 వసూలు చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.750 చెల్లించారు. అభ్యర్థులు జూన్ 2న ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను విడుదల చేసింది. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 6న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
బీఈడీ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
బీఈడీ పరీక్ష విధానం:
మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 25 మార్కులు, తెలుగు ప్రొఫీషియన్సీ 25 మార్కులు, జనరల్ మెంటల్ ఎబిలిటీకి 50 మార్కులు కేటాయించారు.
బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) పరీక్ష విధానం:
మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పేపరును రెండు భాగాలుగా(పార్ట్-ఎ, పార్ట్-బి) విభజిస్తారు. వీటిలో పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 40 మార్కులు, పార్ట్-బి: జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ & అనలిటికల్ రీజనింగ్ (వెర్బల్ & అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్) 60 మార్కులు ఉంటాయి.
అంబేద్కర్ దూరవిద్య బీఈడీ నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!
ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రవేశాలు కోరేవారు జూన్ 4 నుంచి జూన్ 26న సాయంత్రం 5 గంటల్లోపు వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్ధులకు సీటు కేటాయింపు ఉంటుంది. ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు యేటా మూడు సార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..