మీ లైంగిక జీవితం ఎలా ఉంటుంది? సంతృప్తి కరంగా ఉండటం లేదా? అయితే జాగ్రత్త కొంత వయసు వచ్చిన తర్వాత మీకు మెమరీ లాస్ కి గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. లైంగిక జీవితం మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలదా? అనే దాని గురించి పెన్ స్టేట్ పరిశోధకులు పురుషులపై నిర్వహించిన ఒక అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడిస్తుంది. తక్కువ లైంగిక సంతృప్తిలో ఉన్న వారికి భవిష్యత్ లో అభిజ్ఞా క్షీణతకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంది. ఈ అధ్యయనంలో పురుషులలో అంగస్తంభన పనితీరు, లైంగిక సంతృప్తి, జ్ఞాపకశక్తి మధ్య సంబంధాలని గురించి పరిశీలించారు. లైంగిక సంతృప్తి, అంగస్తంభన పనితీరు సరిగా లేకపోతే ఫ్యూచర్ లో జ్ఞాపకశక్తి కోల్పోతారని పరిశోధకులు కనుగొన్నారు.


ఈ అధ్యయనం వియత్నాం ఎరా ట్విన్ స్టడీ ఆఫ్ ఏజింగ్‌లో పాల్గొన్న 818 మంది పురుషుల డేటాను సర్వే చేసింది. ఇందులో పాల్గొన్న వారి డేటా 12 సంవత్సరాలకు ఒకసారి పరిశీలించారు. 56 నుంచి 68 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ సర్వేలో పాల్గొన్నారు. 12 సంవత్సరాల్లో వారి జ్ఞాపకశక్తిలో ఎటువంటి మార్పులు వచ్చాయో అధ్యయనం చేశారు. మెమరీ ఫంక్షన్, లైంగిక పనితీరు కాలక్రమేణా వ్యక్తుల జ్ఞాపకశక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశోధకులు పరిశీలించారు. ఈ రెండింటి పనితీరుని కొలిచి వాటి మధ్య సంబంధాన్ని శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవడం ప్రారంభించినట్టు అధ్యయనంలో పాల్గొన్న ఒక ప్రొఫెసర్ వెల్లడించారు.


ఏమేం పరిశీలించారు?


పురుషాంగ పనితీరుని ప్రభావితం చేసే మైక్రోవాస్కులర్ మార్పులు, లైంగిక సంతృప్తి, మానసికంగా ఎలా ఉంటున్నారు వాటి మధ్య సంబంధాన్ని పరిశోధకులు అధ్యయనం చేశారు. లైంగిక జీవితం గురించి ఎటువంటి ఆలోచనలు చేస్తారు. దాని ప్రాముఖ్యం, ఆరోగ్యంపై దాని శారీరక మానసిక ప్రభావాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. లైంగికంగా ఎంతమందితో ఉన్నారు, ఎంత సేపు ఉంటున్నారు అనే దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ఒక్కొక్కరి ఆలోచన తీరు ఒక్కోలా ఉండవచ్చు, కొంతమందికి భిన్నమైన సంతృప్తి కలగవచ్చు. అది మెదడు పనితీరు మీద ప్రభావం చూపుతుంది. అంగస్తంభన పనితీరు, లైంగిక సంతృప్తిని ఇంటర్నేషనల్ ఇండెక్స్ ఆఫ్ ఎరెక్టైల్ ఫంక్షన్ ఉపయోగించి కొలుస్తారు.


చివరకు పరిశోధన ఏం సూచించింది?


అంగస్తంభన్ పనితీరులో పెరుగుదల లేదా తగ్గుదల, లైంగిక సంతృప్తి, జ్ఞాపకశక్తి పనితీరులో ఏకకాలంలో హెచ్చుతగ్గులు కనిపించినట్టు పరిశోధకులు కనుగొన్నారు. గతంలో కూడా ఇటువంటి అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. 2021 లో 155 మంది పురుషుల మీద 10 సంవత్సరాల పాటు అధ్యయనం జరిపారు. లైంగిక సంతృప్తి ఉన్న వారికి భవిష్యత్ లో మెమరీ లాస్ లేదా చిత్త వైకల్య వచ్చే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అంతే కాదు అంగస్తంభన లోపం ఉన్న పురుషులు ముఖ్యంగా యువకుల్లో కార్డియోవాస్కులర్ డిసీజ్ (CVD) ప్రమాదాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే