APTET 2024: ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్‌) – 2024 పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,67,559 మంది అభ్యర్థులు టెట్‌ పరీక్షకు హాజరుకానున్నారు. ఇప్పటికే విద్యా శాఖ హాల్‌ టికెట్లు కూడా జారీ చేయగా.. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు రోజుకు రెండు సెషన్లలో టెట్‌ పరీక్షలు నిర్వహించననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 120 సెంటర్లలో టెట్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఆయా సెంటర్లలో అభ్యర్థులకు అవసరమైన తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించినట్టు కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


పరీక్షలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున 26 మందిని నియమించినట్లు తెలిపారు. 300 మంది అభ్యర్థులకు ఒక డిపార్ట్‌మెంటల్‌ అధికారిని నియమించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు కూడా డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను నియమించినట్టు తెలిపారు. వైకల్యం కలిగిన అభ్యర్థుల కోసం సహాయకులను అందించడంతో పాటు వారికి 50 నిమిషాల అదనపు సమయం కేటాయించినట్లు తెలిరు. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ అభ్యర్థులు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు, డీఈడీ అభ్యర్థులు ఎస్‌జీటీ పోస్టులకు మాత్రమే టెట్‌ రాయాల్సి ఉంటుంది. ఇతర సందేహాలు నివృతి కోసం టెట్‌ జరిగే అన్ని రోజుల్లో ఉదయం 7.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. అభ్యర్ధులు 95056 191­27, 97056 55349, 81219 47387, 81250 469­97 నెంబర్లకు ఫోన్‌ చేయొచ్చని వెల్లడించారు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు  కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయారోజుల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ ప్రాథమిక 'కీ' మార్చి 10న విడుదల చేయనున్నారు. ఆన్సర్ కీపై మార్చి 11 వరకు ఈ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం మార్చి 13న టెట్ తుది ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. మార్చి 14న టెట్‌ తుది ఫలితాలు విడుదల చేయనున్నారు.  డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. 


ఏపీటెట్ 2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


ఏపీటెట్ పరీక్ష విధానం (AP TET 2024 Exam Pattern):


* పేపర్-1(ఎ): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 (తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.


* పేపర్-1(బి): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి (స్పెషల్ ఎడ్యుకేషన్)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 (తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.


* పేపర్-2(ఎ): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1(తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా/సంస్కృతం)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్ & సైన్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-1(తెలుగు/ఇంగ్లిష్/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా/సంస్కృతం)-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.


* పేపర్-2(బి): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి (స్పెషల్ ఎడ్యుకేషన్)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 (తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.


ఏపీటెట్ సిలబస్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..


APTET Information Bulletin