APRS Minority CAT  Admissions: ఆంధ్రప్రదేశ్‌‌లోని ఏపీ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5, 6, 7, 8 తరగతుల్లో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌ఎస్ (మైనార్టీ) క్యాట్-2024 నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు మే 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కింది తరగతిలో వచ్చిన మార్కులు, ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఒకవేళ ఏమైనా సీట్లు మిగిలిన పక్షంలో ఏపీఆర్‌ఎస్ రెగ్యులర్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ద్వారా భర్తీచేస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉండాలి.


వివరాలు..


* మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5 - 8వ తరగతుల్లో ప్రవేశాలు


సీట్ల సంఖ్య: 1993.


➥ 5వ తరగతిలో సీట్ల సంఖ్య: 920.


➥ 6-8వ తరగతుల్లో సీట్ల సంఖ్య: 1073. 


అర్హతలు..


➥ 5వ తరగతిలో ప్రవేశాలకు విద్యార్ధులు సంబంధిత పాత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 2022-23 విద్యాసంవత్సరంలో 3వ తరగతి చదివి, 2023-24 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతూ ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2013 - 31.08.2015 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2011 - 31.08.2015 మధ్య జన్మించి ఉండాలి.


➥ 6వ తరగతిలో ప్రవేశాలకు విద్యార్ధులు సంబంధిత పాత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 2023-24 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2012 - 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2010 - 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.


➥ 7వ తరగతిలో ప్రవేశాలకు విద్యార్ధులు సంబంధిత పాత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 2023-24 విద్యా సంవత్సరంలో 6వ తరగతి చదువుతూ ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2011 - 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2009 - 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి.


➥ 8వ తరగతిలో ప్రవేశాలకు విద్యార్ధులు సంబంధిత పాత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 2023-24 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదువుతూ ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2010 - 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2008 - 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి.


➥ తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి.


దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన, అకడమిక్ మెరిట్. ఏపీఆర్‌ఎస్ క్యాట్ పరీక్ష ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు..


➥ ప్రవేశ ప్రకటన: 01.03.2024.


➥ మొదటి దశ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.05.2024.


➥ మొదటి దశ దరఖాస్తులకు చివరి తేదీ: 31.05.2024.


Notification


Website


ALSO READ:


APRJC: ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌జేసీ (మైనార్టీ) సెట్‌-2024 నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్‌ 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొదటి విడత ప్రవేశ ప్రక్రియ మే 1 నుంచి 21 వరకు, రెండో విడత ప్రవేశ ప్రక్రియ మే 22 నుంచి 31 వరకు, మూడో విడత ప్రవేశ ప్రక్రియ జూన్ 1 నుంచి 11 వరకు కొనసాగనుంది. జూన్ 18లోగా ప్రవేశప్రక్రియను ముగించనున్నారు.  పదోతరగతి మార్కుల ఆధారంగా; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
నోటిఫికేషన్, ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...