APRJC CET (Minority) - 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌జేసీ (మైనార్టీ) సెట్-2024 నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్ 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొదటి విడత ప్రవేశ ప్రక్రియ మే 1 నుంచి 21 వరకు, రెండో విడత ప్రవేశ ప్రక్రియ మే 22 నుంచి 31 వరకు, మూడో విడత ప్రవేశ ప్రక్రియ జూన్ 1 నుంచి 11 వరకు కొనసాగనుంది. జూన్ 18లోగా ప్రవేశప్రక్రియను ముగించనున్నారు. పదోతరగతి మార్కుల ఆధారంగా; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
వివరాలు..
* మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు
కళాశాలలు, సీట్ల వివరాలు..
సీట్ల సంఖ్య: 345. (ఒక్కో కళాశాలలో 115 సీట్లు)
➥ ఏపీఆర్ జూనియర్ కళాశాల (మైనారిటీ- బాలురు), గుంటూరు.
➥ ఏపీఆర్ జూనియర్ కళాశాల (మైనారిటీ- బాలురు), కర్నూలు.
➥ ఏపీఆర్ జూనియర్ కళాశాల (మైనారిటీ- బాలికలు), వాయల్పాడు.
గ్రూపుల వారీగా సీట్లు: ఎంపీసీ-120 (40+40+40), బైపీసీ- 120 (40+40+40), సీఈసీ-105 (35+35+35).
అర్హత: 2023-24 విద్యా సంవత్సరంలో పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: పదోతరగతి మార్కుల ఆధారంగా; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు..
➥ ప్రవేశ ప్రకటన: 01.03.2024.
➥ మొదటి దశ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.05.2024.
➥ మొదటి దశ దరఖాస్తులకు చివరి తేదీ: 20. 05.2024.
➥ మొదటి జాబితా ఫలితాల వెల్లడి: 21.05.2024
➥ రెండో దశ దరఖాస్తులు ప్రారంభం: 22.05.2024.
➥ రెండో జాబితా దరఖాస్తులకు చివరి తేదీ: 30.05.2024.
➥ రెండో జాబితా ఫలితాల వెల్లడి: 31.05.2024.
➥ మూడో దశ దరఖాస్తులు ప్రారంభం: 01.06.2024
➥ మూడో జాబితా దరఖాస్తులకు చివరి తేదీ: 10.06.2024.
➥ మూడో జాబితా ఫలితాల వెల్లడి: 11.06.2024
➥ ప్రవేశాల ముగింపు తేదీ: 18.06.2024
ALSO READ:
APRJC CET - 2024: ఏపీఆర్‌జేసీ సెట్-2024 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న జూనియర్ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాల కోసం ఏపీఆర్‌జేసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (APRJC CET) - 2024 నోటిఫికేషన్ మార్చిన విడుదలైంది. పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరువారు మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఏప్రిల్ 17 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను మే 14న ప్రకటించనున్నారు. అనంతరం ఇంటర్‌లో కోర్సుల వారీగా సీట్లను భర్తీ చేసేందుకు తొలి విడత కౌన్సిలింగ్ మే 22 నుంచి 25 వరకు; మే 28 నుంచి 30 వరకు రెండో విడత; జూన్ 5 నుంచి 7 వరకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, ప్రవేశ వివరాల కోసం క్లి్క్ చేయండి..