ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి మూడో విడత (ఫేజ్-3) కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 16తో ముగియనుంది. రాష్ట్రంలోని ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. మొదటి దఫాలో 38,355 మంది దరఖాస్తు చేశారు. నాలుగు క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న 294 సీట్ల భర్తీకి ఆగస్టు 23, 27 తేదీల్లో నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. క్యాంపస్‌ల మార్పుకు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆగస్టు 16లోగా మూడో విడత దరఖాస్తు, క్యాంపస్‌ మార్పునకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 294 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీ సీట్లు 289 ఉండగా, స్పెషల్ కేటగిరీ సీట్లు 5 ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో నూజివీడు క్యాంపస్‌ పరిధిలో 15 సీట్లు, ఒంగోలు క్యాంపస్ పరిధిలో 160 సీట్లు, శ్రీకాకుళం క్యాంపస్ పరిధిలో 100 సీట్లు, ఆర్కేవ్యాలీ క్యాంపస్ పరిధిలో 14 సీట్లు అందుబాటులో ఉన్నాయి.   


రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయిన సీట్ల వివరాలు..


మూడో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి..





ALSO READ:


తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సులు, వివరాలు ఇలా!
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్‌ యూనివర్సిటీ) 2022-23 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


కాళోజీ  హెల్త్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు, డిగ్రీ అర్హత చాలు
తెలంగాణలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌) కోర్సులో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశపరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 2న ఫలితాలు వెల్లడించనున్నారు. 
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


APPSC: ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..