AP EDCET 2024 Spot Counselling: ఏపీలోని బీఈడీ కళాశాలల్లో స్పాట్, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి (APSCHE) విడుదల చేసింది. కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లను స్పాట్ కోటా కింద ఏప్రిల్ 12లోపు సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ప్రవేశాలు నిర్వహించాలని, ఈ వివరాలను వెబ్ పోర్టల్‌లో ఏప్రిల్ 12లోపు అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను స్థానికులతోనే భర్తీ చేయాలని, సబ్జెక్టు మెథడాలజీ ప్రకారమే సీట్లు కేటాయించాలని సూచించింది. యాజమాన్య కోటా 25 శాతం సీట్ల కోసం ఏప్రిల్ 4 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని యాజమాన్యాలను ఆదేశించింది. అపరాధ రుసుముతో ఏప్రిల్ 20 వరకు అవకాశం కల్పించింది. యాజమాన్య కోటా (కేటగిరి-బీ) రిజిస్ట్రేషన్‌కు ఎడ్‌సెట్ ఉత్తీర్ణులైన వారు రూ.1000, అనుత్తీర్ణులైన వారు రూ.1,400 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 411 బీఈడీ కళాశాలల్లో మొత్తం  34 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉండగా..  ఇప్పటికే రెండు విడత కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. ఇక మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్‌తోపాటు, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.


స్పాట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..


మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..


Counselling Website


స్పాట్ కౌన్సెలింగ్ షెడ్యూలు..


➥ నోటిఫికేషన్: 28.03.2024.


➥ స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహణ: 30.03.2024 - 03.04.2024.


➥ వెబ్‌పోర్టల్‌లో స్పాట్ ప్రవేశాల అప్‌లోడింగ్: 04.04.2024 - 12.04.2024.


➥ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 04.04.2024 - 12.04.2024.


➥ రోజుకు రూ.2000 అపరాధ రుసుముతో వెబ్‌పోర్టల్‌లో స్పాట్ ప్రవేశాల అప్‌లోడింగ్: 13.04.2024 - 20.04.2024.


➥ రోజుకు రూ.2000 అపరాధ రుసుముతో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 13.04.2024 - 20.04.2024.


మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశ షెడ్యూలు..


➥ మేనేజ్‌మెంట్ కోటా (బి-కేటగిరి) ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం: 04.04.2024.


➥ బి-కేటగిరి ప్రవేశాల అప్‌లోడింగ్: 04.04.2024 - 12.04.2024.


➥ రోజుకు రూ.2000 ఆలస్యరుసుముతో బి-కేటగిరి ప్రవేశాల అప్‌లోడింగ్‌కు అవకాశం: 13.04.2024 - 20.04.2024.


➥ రోజుకు రూ.2000 ఆలస్యరుసుముతో బి-కేటగిరి ప్రవేశాల ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు అవకాశం: 13.04.2024 - 20.04.2024.


సర్టిఫికేట్ల పరిశీలనకు అవసరమయ్యే డాక్యుమెంట్లు..


  క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ కన్సాలిడేట్ మార్కుల మెమో, ప్రొవిజినల్ పాస్ సర్టిఫికేట్. 


 పదోతరగతి లేదా తత్సమాన మార్కుల మెమో.


 ఇంటర్మీడియట్ మార్కుల మెమో


 స్టడీ సర్టిఫికేట్లు


 రెసిడెన్స్ సర్టిఫికేట్ (అవసరమైనవారికి)


 క్యాస్ట్ సర్టిఫికేట్ (అవసరమైనవారికి)


 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (అవసరమైనవారికి)


 ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్(TC)


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్‌ ట్రైనింగ్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రవేశపరీక్షను జూన్ 14న ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్ష నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 77 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.  పరీక్షకు 13,672 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,235 (82.17 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను జులై 14న విడుదల చేయగా.. ఫలితాల్లో మొత్తం 10,908 (97.08 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...