ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్ష ఆగస్టు 6న ప్రారంభమై ఆగస్టు 21న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5,25,789 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు.అంతే కాకుండా రాష్ట్రంతో పాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు.అయితే.. కమిషన్ ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏపీ టెట్ ఫలితాలు సెప్టెంబర్ 14 విడుదలకావాల్సి ఉంది. అయితే.. ఈ నెల 12వ తేదీన టెట్ ఫైనల్ కీని వెబ్ సైట్లో విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు టెట్ కీని విడుదల చేయలేదు. దీంతో.. సెప్టెంబర్ 14న విడుదల కావాల్సి ఉన్న ఫలితాలపై సైతం సందిగ్ధత నెలకొంది.అయితే ఇప్పటికే టెట్ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఆగస్టు 31న విడుదల చేశారు. సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు.
అయితే.. ఫైనల్ కీ మాత్రం ఈ రోజు రాత్రిలోగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారుల నుంచి సమాచారం. అయితే.. ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై మాత్రం టెట్ అధికారులు స్పందించడం లేదు. ఫలితాల విడుదల వాయిదా పడిన అంశంపై సైతం అధికారులు ప్రకటన విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు టెట్ విషయంలో మొదటి నుంచి కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ రోజు టెట్ ఫైనల్ కీ విడుదల అయితే.. వారంలోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవచ్చు.
ఇదిలా ఉంటే ఏపీలోని పాఠశాలలకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా సెలవులను ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. దీంతో విద్యార్థులకు మొత్తం 12 రోజులు సెలవులు రానున్నాయి. సెలవుల తర్వాత ఫార్మెటివ్-1 పరీక్షలను నిర్వహించనున్నారు.ఈ ఏడాది ఓమ్మార్ షీట్‌తో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఎమ్మార్ షీట్ల ముద్రణ పూర్తికాకపోవడంతో పరీక్షలను వాయిదా వేస్తూ వస్తున్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షలకు రూ.కోట్లు వెచ్చించి, ఓఎమ్మార్ షీట్లు ముద్రించడంపై విమర్శలు వస్తున్నాయి.
AP TET 2022 షెడ్యూల్:
నోటిఫికేషన్ విడుదల: జూన్ 10,2022
దరఖాస్తు రుసుములు చెల్లింపులు: జూన్ 15 నుంచి జులై 15 వరకు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం: జూన్ 16 నుంచి జులై 16 వరకు.
హెల్ప్ డెస్క్ సేవలు: జూన్ 13 నుంచి ప్రారంభం.
ఆన్‌లైన్ మాక్ టెస్ట్ సదుపాయం: జులై 26 నుంచి
హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్: జులై 25 నుంచి
పరీక్షల నిర్వహణ: 06.08.2022 నుంచి 21.08.2022 వరకు జరుగుతాయి.
ప్రాథమిక కీ విడుదల: 31.08.2022
అభ్యంతరాల స్వీకరణ: 01.09.2022 నుంచి 07.09.2022.
ఫైనల్ కీ విడుదల: 12.09.2022.
ఫలితాల విడుదల: 14.09.2022
Also Read:
సీఎస్ఐఆర్ – యూజీసీ నెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి, పరీక్ష ఎప్పుడంటే!
సీఎస్ఐఆర్ – యూజీసీ నెట్ పరీక్షలను సెప్టెంబరు 16, 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించిన సంగతి తెలిసిందే. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, లెక్చరర్‌షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా అర్హత సాధించేందుకు నిర్వహించే ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించనుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను సెప్టెంబరు 12న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ప్రారంభమైన 'జోసా' రిజిస్ట్రేషన్ ప్రక్రియ, డైరెక్ట్ లింక్ ఇదే!
జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో.. సంబంధిత కళాశాలల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను జోసా(జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) సెప్టెంబరు 12న ప్రారంభించింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక కోసం ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభించాల్సి ఉంటుంది.
జోసా' కౌన్సెలింగ్‌లో భాగంగా.. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు సెప్టెంబరు 12 నుంచి తమకు నచ్చిన విద్యాసంస్థలో సీటు కోసం ఆన్‌లైన్‌లో ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని ఆప్షన్లనైనా ఇచ్చుకునే వెసులుబాటు ఉంది. తదనంతరం విద్యార్థుల అవగాహన కోసం మాక్ సీటు అలకేషన్‌ను చేపట్టనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
AP TET 2022 RESULTS: ఏపీ టెట్ -2022 రిజల్ట్, ఫైనల్ కీ విడుదల ఎప్పుడంటే!
ABP Desam
Updated at:
14 Sep 2022 02:09 PM (IST)
షెడ్యూల్ ప్రకారం ఏపీ టెట్ ఫలితాలు సెప్టెంబర్ 14 విడుదలకావాల్సి ఉంది. అయితే.. ఈ నెల 12వ తేదీన ఫైనల్ కీని వెబ్ సైట్లో విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఫైనల్ కీని విడుదల చేయలేదు.
ఏపీ టెట్ -2022 ఫలితాలు,ఫైనల్ కీ అప్డేట్స్
NEXT
PREV
Published at:
14 Sep 2022 02:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -