రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 23న విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాసిన వారిలో 81.14 శాతం మంది విద్యార్థులు పాసయ్యారని విద్యాశాఖ తెలిపింది. టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరైన 6,14,459 మంది విద్యార్థులు కాగా, వీరిలో 4,98,585 మంది విద్యార్థులు పాసయ్యారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ లో, ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు..
93.90శాతం ఉత్తీర్ణతతో మొదటిస్థానంలో మన్యం జిల్లా నిలిచింది. టెన్త్ పరీక్షలలో 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు 1680 ఉన్నాయి. ఫలితాలను ఆన్ లైన్, వాట్సాప్ లో అప్ లోడ్ చేసి విద్యార్ధులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ ఫలితాలు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లోనూ అందుబాటులో ఉంటాయి. దీంతో వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లో ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో అధికారులు వివరాలు వెల్లడించారు.
అభ్యర్థులు టెన్త్ ఫలితాల కోసం వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలు ఎంచుకుని, ఆపై టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్ ద్వారా టెన్త్ క్లాస్ ఫలితాల PDF కాపీని పొందవచ్చు.
టెన్త్ రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి హైలైట్స్.. • అభ్యర్థులను సమర్పించిన మొత్తం పాఠశాలల సంఖ్య: 11,819• టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థులు : 6,14,459• రాష్ట్రవ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం (రెగ్యులర్ అభ్యర్థులు): 81.14%• బాలురు ఉత్తీర్ణత శాతం: 78.31%• బాలికలు ఉత్తీర్ణత శాతం: 84.09%• బాలికల మొత్తం ఉత్తీర్ణత శాతం బాలుర కంటే 5.78% ఎక్కువ.• మొత్తం 1,680 పాఠశాలలు 100% ఉత్తీర్ణత రేటును సాధించాయి.• 19 పాఠశాలలు 0% ఉత్తీర్ణత రేటును నివేదించాయి.• పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని 93.90%తో నమోదు చేసింది.• అల్లూరి సీతారామరాజు జిల్లా 47.64%తో అత్యల్ప ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసింది.• ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలు 95.02%తో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయి.• డివిజన్ వారీగా విద్యార్థుల ఫలితాలు ఇలా ఉన్నాయి. 65.36% మంది ఫస్ట్ డివిజన్, 10.69% మంది సెకండ్ డివిజన్, 5.09% మంది థర్డ్ డివిజన్ సాధించారు.
2015 నుండి 2025 వరకు సంవత్సం వరకు పనితీరులో 2019 వరకు స్థిరమైన ఉత్తీర్ణత రేట్లు 90% కంటే ఎక్కువగా ఉన్నాయి. మహమ్మారి సంబంధిత కారణంగా 2020, 2021లో 100% ఉత్తీర్ణత శాతాలు ఉన్నాయి. 2022లో అత్యల్ప ఉత్తీర్ణత రేటు (67.26%), ఆ తర్వాత 2025లో క్రమంగా కోలుకుని ఏకంగా 81.14%కి చేరుకుంది.• SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 19-05-2025 నుండి 28-05-2025 వరకు షెడ్యూల్ చేశారు.