AP SSC Exams: వెబ్‌సైట్‌లో పదోతరగతి మోడల్ పేపర్లు - బ్లూప్రింట్స్, చెక్ చేసుకోండి!!

2022-23 ఏడాది నుంచి పదోతరగతి పరీక్షల్లో కొత్తగా ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మాదిరి పశ్నాపత్రాలు, బ్లూప్రింట్, ప్రశ్నల వారీగా వెయిటేజీని అందుబాటులో ఉాంచారు.

Continues below advertisement

కొత్త విధానం ప్రకారం పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్‌ను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానంద్‌ రెడ్డి సెప్టెంబర్‌ 8న ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 ఏడాది నుంచి పదోతరగతి పరీక్షల్లో కొత్తగా ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మాదిరి పశ్నాపత్రాలు, బ్లూప్రింట్, ప్రశ్నల వారీగా వెయిటేజీని https://www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు. 
 

Continues below advertisement

మాదిరి పశ్నాపత్రాలు, బ్లూప్రింట్ ఇలా..

క్ర.సం

సబ్జెక్టులు

పేపర్ కోడ్

డౌన్లోడ్

1

I లాంగ్వేజ్ (తెలుగు) 

01T & 02T

CLICK HERE

2

I లాంగ్వేజ్  పేపర్- I (కంపోజిట్ తెలుగు)

03T

CLICK HERE

I లాంగ్వేజ్ పేపర్- II (కంపోజిట్ సంస్కృతం)

04S

CLICK HERE

4

II లాంగ్వేజ్ (తెలుగు)

09T

CLICK HERE

5

II లాంగ్వేజ్( హిందీ)

09H

CLICK HERE

6

III లాంగ్వేజ్  పేపర్ - I & II ( ఇంగ్లిష్)

13E & 14E

CLICK HERE

7

మ్యాథమెటిక్స్ పేపర్- I & II (ఇంగ్లిష్ మీడియం)

15E & 16E

CLICK HERE

8

మ్యాథమెటిక్స్ పేపర్- I & II (తెలుగు మీడియం)

15T & 16E

CLICK HERE

9

జనరల్ సైన్స్ పేపర్- I & II (ఇంగ్లిష్ మీడియం)

19E & 20 E

CLICK HERE

10

జనరల్ సైన్స్ పేపర్- I & II (తెలుగు మీడియం)

19E & 20 T

CLICK HERE

11

సోషల్ పేపర్- I & II (ఇంగ్లిష్ మీడియం)

21E & 22E

CLICK HERE

12

సోషల్ పేపర్- I & II (తెలుగు మీడియం)

21T & 22T

CLICK HERE

మాదిరి పశ్నాపత్రాలు, బ్లూప్రింట్స్ లింక్ కోసం క్లిక్ చేయండి..

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 11 పేపర్లుగా నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించింది. రెండేళ్ల కిందటి వరకు 11 పేపర్ల విధానమే అమలైంది. కొవిడ్‌ అనంతరం 2021-22 విద్యాసంవత్సరానికి పరీక్షలను ఏడు పేపర్లతో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కొవిడ్‌ నేపథ్యంలో 11 పేపర్ల స్థానంలో ఏడు పేపర్ల విధానం అమలు చేస్తున్నామని ఎస్‌సీఈఆర్‌టీ తన ప్రతిపాదనలో పేర్కొంది.


Also Read: ఏపీ సర్కారు బాటలో కేంద్రం- బడి బాగు కోసం పీఎం 'శ్రీ'కారం


గతంలో నాలుగు యూనిట్‌ పరీక్షలు, రెండు టెర్మినల్‌ పరీక్షలు ఉండేవని, దీంతో విద్యార్థులు అన్ని పాఠ్యాంశాలను విస్తృతంగా అవగాహన చేసుకునేందుకు 11 పేపర్ల విధానం తెచ్చారని వివరించింది. అనంతరం నాలుగు ఫార్మేటివ్‌ పరీక్షలు, రెండు టెర్మినల్‌ పరీక్షల విధానం వచ్చిందని తెలిపింది. అందువల్ల ఇక పబ్లిక్‌ పరీక్షల్లో విస్తృత విధానం అవసరం లేదని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సీబీఎస్ఈ ఆరు పేపర్ల విధానం అమలు చేస్తోంది కనుక ఆరు లేదా ఏడు పేపర్లలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై అధ్యయనం చేసిన ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో పూర్తిగా సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినందున, అందుకు సమాంతర విధానం అమలుకు నిర్ణయించినట్టు తెలిపింది. ఇప్పటి నుంచే విద్యార్థులు ఆరు పేపర్ల విధానానికి అలవాటు పడేలా ఈ విద్యా సంవత్సరం నుంచే ఆరు పేపర్ల విధానం తేనున్నట్లు పేర్కొంది. గతేడాది సైన్స్‌లో రెండు పేపర్లు(ఫిజిక్స్‌, బయాలజీ) ఉండగా, ఇకపై రెండిటికీ కలిపి ఒకే పరీక్ష ఉంటుందని తెలిపింది. అయితే, సైన్స్‌కు ప్రశ్నపత్రం ఒకటే అయినా, జవాబు పత్రాలు వేర్వేరుగా ఇస్తారని పేర్కొంది.  


Also Read:
నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?


దశలవారీగా సీబీఎస్ఈలోకి..

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలన్నిటినీ సీబీఎస్ఈ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా ఈ ఏడాది సీబీఎస్ఈ నుంచి కొన్ని పాఠశాలలకు అనుమతులు సాధించింది. దశలవారీగా అన్ని పాఠశాలలనూ ఇందులోకి తీసుకురానుంది. ఈ ఏడాది ఎనిమిదో తరగతితో మొదలుపెడితే 2024-25 నాటికి ఆ విద్యార్థులు పదో తరగతికి వస్తారు కాబట్టి అందుకు సన్నద్ధతగా ఈ నిర్ణయం తీసుకుంది.


సప్లిమెంటరీ పరీక్షలకూ 7 పేపర్లు

కరోనా కారణంగా 2020–21లో కూడా పది పరీక్షలను నిర్వహించలేదు. విద్యార్థులను ఆల్‌పాస్‌గా ప్రకటించారు. దీంతో విద్యార్థుల పై చదువులకు, ఉద్యోగాలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు వారి అంతర్గత మార్కుల బట్టి గ్రేడ్లు ప్రకటించారు. 2020లో 6,37,354 మంది, 2021లో 6,26,981 మంది పదో తరగతి విద్యార్థులకు అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పదోతరగతిలో ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను కూడా ఏడు పేపర్లతోనే నిర్వహిస్తారు. సామాన్య శాస్త్రం మినహా అన్ని సబ్జెక్టులకూ ఒకే పేపరు నిర్వహిస్తారు. ప్రతీ పేపర్ లో మొత్తం 33 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు ఒకటిగా, జీవశాస్త్రం పేపర్లు ఒకటిగా ఇస్తారు. 100 మార్కుల పరీక్షకు 3.15 గంటల సమయం ఇవ్వగా... ప్రశ్నపత్రం చదువుకోవడానికి, రాసింది సరి చూసుకోవడానికి 15 నిమిషాలు, పరీక్ష రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది. 7 పేపర్ల విధానాన్ని ఈ ఒక్క ఏడాదే అమలు మాత్రమే చేయనున్నారు. 2023 మార్చి నుంచి తిరిగి 11 పేపర్ల విధానం అమల్లోకి వస్తుంది.

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola