AP Half Day Schools : ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలకు(AP Schools) ఈనెల 4వ తేదీ నుంచి నుంచి ఒంటిపూట బడులు(Half Days) నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్(Minister Adimulapu Suresh) ప్రకటించారు. ఎండల తీవ్రత దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సోమవారం నుంచి ఉదయం గం.7.30ల నుంచి గం.11.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు(SSC Exams) నిర్వహించనున్నారు. మే 6వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు(Intermediate Exams) జరగనున్నాయి. ఒంటిపూట బడులపై ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 


పదో తరగతి పరీక్షలు


AP SSC Exams : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల(10th Class Exams) షెడ్యూల్‌ను విద్యాశాఖ ఖరారు చేసింది. పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్‌(Intermediate) పరీక్షలను మే 6 నుంచి నిర్వహిస్తున్నారు. అందువల్ల పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 2వ తేదీ నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, జేఈఈ(JEE) పరీక్షలు కారణంగా పరీక్షల షెడ్యూల్ ను మార్పులు చేశారు. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ తాజాగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. 


పదో పరీక్షల తేదీలు



  • ఏప్రిల్‌ 27వ తేదీ - తెలుగు

  • ఏప్రిల్‌ 28వ తేదీ - సెకండ్‌ లాంగ్వేజ్‌

  • ఏప్రిల్‌ 29వ తేదీ - ఇంగ్లిష్‌

  • మే 2వ తేదీ -  గణితం

  • మే 4వ తేదీ  -  సైన్స్‌ పేపర్‌-1

  • మే 5వ తేదీ  -  సైన్స్‌ పేపర్‌-2

  • మే 6వ తేదీ  -  సోషల్ 


ఇంటర్ పరీక్షలు 





ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్(Intermediate) పరీక్షలు మే 6 నుంచి మే 24 వరకు జరుగనున్నాయి. గతంలో విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్‌ పరీక్షలను ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. దీంతో పరీక్షలను వాయిదా వేసి కొత్త షెడ్యూల్ ప్రకటించారు. ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మే 6 నుంచి 23 వరకు ఇంటర్ మొదటి సంవత్సవరం పరీక్షలు జరగనున్నాయి. మే 7 నుంచి మే 24 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. జేఈఈ పరీక్షల కారణంగా పరీక్షల షెడ్యూల్ మార్పులు చేసిన బోర్డు పేర్కొంది.