AP Schools Academic Calendar 2024-25: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు సంబంధించి 2024-25 విద్యాసంవత్సరానికిగాను అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం జులై 23న విడుదల చేసింది. ఈ విద్య సంవత్సరంలో పాఠశాలల పని దినాలు, సెలవుల వివరాలు, పాఠశాలల పని సమయాలు, పరీక్షల షెడ్యూలు.. ఇలా అన్ని వివరాలను క్యాలెండర్‌లో పొందుపరిచారు. అలాగే 1 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్ధులకు పరీక్షల షెడ్యూల్స్‌ను కూడా అకడమిక్ క్యాలెండర్‌లో ప్రకటించారు. విద్యాశాఖ ప్రకటించిన ఈ క్యాలెండర్ ప్రకారమే విద్యాసంవత్సరంలో  రాష్ట్రంలోని అన్ని పాఠశాలు పనిచేయాల్సి ఉంటుంది. ఇక అకస్మికంగా ప్రకటించే సెలవులు ఇందుకు అదనంగా ఉంటాయి. 


రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు జూన్ 12న తెరచుకున్న సంగతి తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అకడమిక్ క్యాలెండర్‌ను అధికారులు విడుదల చేయలేదు. తాజాగా క్యాలెండర్‌ను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు జూన్ 12న తెరచుకున్న సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరంలో 233 రోజులపాటు స్కూల్స్ పని చేయనున్నాయి. వేసవి సెలవులు మినహాయించి మొత్తం 315 రోజులు కాగా.. ఇందులో 82 రోజులు సెలవులు ఉన్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించింది. అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10 తరగుతుల విద్యార్థులకు ఈ క్యాలెండర్ వర్తించనుంది.


రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈసారి అక్టోబర్ 4 నుంచి 13 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అయితే క్రైస్తవ మైనార్టీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్ 11 నుంచి 13 వరకూ దసరా సెలవులు ఉంటాయి. అలాగే క్రైస్తవ మైనార్టీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి 29 వరకూ ఇస్తారు. మిగతా అన్ని పాఠశాలలకు డిసెంబరు 25న మాత్రమే క్రిస్మస్ సెలవుదినంగా ఉంటుంది. ఇక అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 19 వరకు ఉండనున్నాయి. అయితే క్రైస్తవ మైనార్టీ పాఠశాలలకు మాత్రం జనవరి 11 నుంచి 19 వరకు సెలవులు ఉండనున్నాయి.


ALSO READ: తెలంగాణలో పాఠశాలల టైమింగ్స్ మార్పు, విద్యాశాఖ ఉత్తర్వులు జారీ


టోఫెల్ తరగతులు ఉంటాయా? 
టోఫెల్ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం జులై 24న నిర్ణయం తీసుకోనుంది. దీన్ని కొనసాగించాలా వద్దా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇంగ్లిష్ టీచర్లతో పాటు డిగ్రీ, పీజీలో ఆంగ్ల సబ్జెక్టు చదివిన వారందరూ టోఫెల్ బోధనలో సహాయకులుగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో టోఫెల్ పరీక్ష నిర్వహిస్తున్నారు. నిర్ణయం వెలువడిన తర్వాతే తరగతులు నిర్వహణపై స్పష్టత రానుంది.


పాఠశాలల సమయమిదే..
➥  రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగనున్నాయి.


➥  రెండు విభాగాలకు చివరి పీరియడ్‌ను క్రీడలకు ఆప్షనల్‌గా పేర్కొన్నారు. ఇక ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి. పర్యావరణ విద్య సబ్జెక్టును 6, 7 తరగతులకు భౌతికశాస్త్రం టీచర్, 8, 9, 10 తరగతులకు జీవశాస్త్రం ఉపాధ్యాయులే చెప్పాలని విద్యాశాఖ సూచించింది. 


పరీక్షల తేదీలు ఇలా..
➥ ఫార్మాటివ్-1(FA1) పరీక్షలు ఆగస్టు 1-5 వరకు 
➥ ఫార్మాటివ్-2 (FA2) సెప్టెంబరు 26-30 వరకు.
➥ సమ్మేటివ్-1 (SA1) పరీక్షలు నవంబరు 1 - 15 వరకు
➥  ఫార్మాటివ్-3 (FA3) జనవరి 2 - 6 మధ్య.
➥  పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 10-20 వరకు.
➥  ఫార్మాటివ్-4 (FA4) పరీక్షలు మార్చి 3-6 వరకు. 
➥ సమ్మేటివ్-2 (SA1) పరీక్షలు ఏప్రిల్ 7- 18 వరకు.


విద్యాసంవత్సరం సెలవులు ఇవే..
➥ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➥  క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➥ అక్టోబరు 31న దీపావళి
➥ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు. 
➥ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.
➥ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..