AP PGECET Results 2024: ఏపీలోని పీజీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్ (AP PGECET) -2024 ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


పీజీఈసెట్ ఫలితాలు/ ర్యాంక్ కార్డు ఇలా చూసుకోండి..


➥ పీజీఈసెట్ ర్యాంకు కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-
https://cets.apsche.ap.gov.in/PGECET/PGECET/PGECET_HomePage.aspx


➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Results/ Download Rank Card' అనే లింక్‌ మీద క్లిక్ చేయాలి.


➥ అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'View Results/ View Rank Card' బటన్ మీద క్లిక్ చేయాలి. 


➥ వివరాలు నమోదుచేయగానే పీజీఈసెట్ ఫలితాలు/ ర్యాంక్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శనమిస్తుంది.


➥ అభ్యర్థులు ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.


కోర్సులు: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, డిప్లమో ఇన్ ఫార్మసీ డీఫార్మసీ. 


AP PGECET - 2024 Results


AP PGECET - 2024 Rank Card


అర్హత మార్కులు..
పీజీఈసెట్ ప్రవేశ పరీక్షను మొత్తం  120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 25 శాతం అంటే 30 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. 


పరీక్ష నిర్వహించిన సజ్జెక్టులు: జియో ఇంజినీరింగ్ అండ్ జియో ఇన్‌ఫర్మాటిక్స్, ఫార్మసీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెటలర్జీ, కెమికల్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ.


ఏపీ పీజీఈసెట్-2024 నోటిఫికేషన్‌‌ను తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ మార్చి 17న విడుదలచేసిన సంగతి తెలిసిందే. మార్చి 23 నుంచి ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆలస్య రుసుముతో  మే 12 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పరీక్ష హాల్‌టికెట్లను మే 22న విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 29 నుంచి 31 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించారు. ఆయా తేదీల్లో ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 02.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 13 సబ్జెక్టులకు పరీక్షలు జరిగాయి. పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలను మే 31 నుంచి జూన్ 2 వరకు సబ్జెక్టులవారీగా తేదీలవారీగా విడుదల చేశారు. అనంతరం జూన్ 2 నుంచి 4 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించారు. అనంతరం జూన్ 18న ఫలితాలను వెల్లడించారు.


ALSO READ:


తెలంగాణ పీజీఈసెట్‌-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే


➥ టీజీ పీఈసెట్ ఫలితాలు విడుదల, 96.48 శాతం ఉత్తీర్ణత న‌మోదు




మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..