ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జులై 25న సాయంత్రం సార్వత్రిక విద్యాపీఠం అధికారులు ఫలితాలను విడుదల చేశారు. జూన్‌, జులైలో జరిగిన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఏపీ ఓపెన్‌ స్కూల్‌ అధికారిక వెబ్‌సైట్‌‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ అడ్మిషన్ నెంబరు లేదా రూల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. తమ మార్కుల జాబితాను స్టడీ కేంద్రాల్లో తీసుకోవాలని అధికారులు సూచించారు.


పదోతరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


వైఎస్సార్‌ హెల్త్‌ వర్సిటీ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. నీట్‌(యూజీ)-2023 అర్హత సాధించిన అభ్యర్థులు జులై 26న సాయంత్రం 6 గంటల్లోగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో అర్హత సాధించిన అభ్యర్థుల తాత్కాలిక ప్రాధాన్య క్రమాన్ని విజయవాడలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏపీ నుంచి 68,578 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాయగా 42,836 మంది అర్హత సాధించారు. వీరంతా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
నోటిఫికేషన్, కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి.


సీపెట్‌ చెన్నైలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో ప్రవేశాలు
చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్‌), స్కూల్ ఫర్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ఇన్ పెట్రో కెమికల్స్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా (మెకానికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, పాలిమర్, ప్లాస్టిక్స్) లేదా ఐటీఐ (ఫిట్టర్/ టర్నర్/ మెషినిస్ట్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 03 వరకు అవకాశం ఉంది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో సీటు కేటాయిస్తారు.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి.


నల్సార్‌ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి.


ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును ప్రారంభించిన కేంద్రం, 9 బాషల్లో ఉచిత ఆన్‌లైన్ శిక్షణ!
కేంద్రప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇండియా 2.0 లో భాగంగా ఉచిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI కోర్సును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌‌కు సంబంధించి ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. స్కిల్ ఇండియా, జీయూవీఐ మధ్య పరస్పర సహకారంతో ఈ కార్యక్రమానికి రూపొందించారు. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, గుజరాతీ, హిందీతోపాటు ఇంగ్లిష్‌లో ఈ కోర్సును అందుబాటులో తీసుకొచ్చారు. ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కోర్సును ప్రారంభిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే బోధన ఉంటుంది. 
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial