ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 10న ప్రారంభంకానుంది. మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థుల జాబితాను జూన్ 16న, సీట్లు పొందినవారి జాబితాను 18న ప్రకటించనున్నారు. జూన్ 19 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇక జూన్ 21 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.


ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ఇప్పటి వరకు లాటరీ విధానంలో సీట్ల కేటాయించగా.. ఈసారి నుంచి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా రాష్ట్రంలోని 164 ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 11న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్ తో తెలుగు/ ఇంగ్లీషు మీడియములో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.


ఈ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే బోధిస్తారు, చదువుకోవడానికి విద్యార్థులు ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదు. ప్రవేశ పరీక్ష కోసం ఓసీ, బీసీ విద్యార్థులు రూ .150; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. మే 9 నుంచి మే 25 వరకు నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా కేటాయించిన జనరల్ నెంబరు ఆధారంగా ఏదైనా ఇంటర్ నెట్ కేంద్రంలో www.cse.ap.gov.in లేదా apms.ap.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


Also Read:


సీబీఎస్‌ఈ విద్యార్థులకు అలర్ట్ - త్వరలోనే 10, 12 తరగతుల పరీక్షల ఫలితాలు!
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షల ఫలితాలను విడుదల చేయడానికి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా సంస్థల్లో ఫలితాలు నేడో, రేపో ఫలితాలు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఫలితాల విడుదలకు సంబంధించి సీబీఎస్‌ఈ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు, మే రెండో వారం నాటికి ఫలితాలు వెల్లడించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు యోచిస్తున్నట్టు కూడా వార్తలు వినబడుతున్నాయి.
మరింత సమాచారం క్లిక్ చేయండి..


TS పాలిసెట్‌ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పడంటే?
తెలంగాణలో పాలిసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.200 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు పెంచినట్లు పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు ఏప్రిల్ 25తో ముగియగా.. రూ.200 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 17న పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
పాలిసెట్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..