ఏపీలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్ష అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ అవకాశాన్ని పేద, అనాథ, బడి బయట ఉన్న విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సందేహాలు ఉంటే 94907 82111, 94943 83617 నంబర్లలో సంప్రదించాలన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో అర్హులైన బాలికలకు అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న 352 కేబీవీ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఆరో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 20 వరకు ఆన్‌‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 


అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్‌లు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ వర్గాల బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని 11జిల్లాల్లోని కేజీవీబి పాఠశాలల్లో దాదాపు 8600మంది విద్యార్ధులు చదువుతున్నారు. ఎంపికైన విద్యార్థులకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు SMS ద్వారా సమాచారం అందిస్తారు. ప్రవేశాలు కోరువారు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడ్మిషన్లు పొందిన వారి వివరాలను అయా పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా ప్రదర్శిస్తారు. 


వివరాలు..


* ఏపీ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలు


అర్హత: అనాథలు, బడి బయట ఉన్న పిల్లలు, స్కూల్ మధ్యలో మానేసిన డ్రాపౌట్స్, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు. అడ్మిషన్లు పొందిన వారి వివరాలను అయా పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో ప్రదర్శిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2023.


➥ ఎంపిక జాబితా వెల్లడి, : 21.4.2023 - 25.04.2023.


➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్: 26.04.2023 నుండి 30.04.2023 వరకు.


Website


Also Read:


జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష - దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 పరీక్ష షెడ్యూలు ఇటీవల వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనుంది. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఏప్రిల్‌ 30 నుంచి మే 7 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జేఈఈ మెయిన్‌-1 పూర్తికాగా, ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్‌-2 నిర్వహించనున్నారు. ఈ రెండు సెషన్ల ఫలితాలను ఏప్రిల్ చివరివారంలో వెల్లడించే అవకాశం ఉంది. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు. దీని ఫలితాల ఆధారంగా ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్‌, బీఎస్‌, బీఆర్క్‌, ఐదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..