తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే 1 నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు ఏప్రిల్ 20తో ముగిశాయి. ఏప్రిల్‌ 12 నుంచి 20 వరకు ఎస్‌ఏ-2 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 21 నుంచి 24 వరకు జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఆ తర్వాత విద్యార్థులకు మార్కులు చెప్పి సెలవులు ప్రకటిస్తారు. పరీక్షల ప్రక్రియ ముగియడంతో ఏప్రిల్‌ 25 నుంచి వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి. జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. పాఠశాలలు తిరిగి జూన్‌ 12న ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు మాత్రం శుక్రవారం ఏప్రిల్ 21 నుంచే వేసవి సెలవులు ప్రకటించేశాయి.


ఏపీలో ఏప్రిల్ 30 నుంచి..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1-9 తరగతుల విద్యార్ధులకు జగన్ సర్కార్ ఏప్రిల్ 30 నుంచి వేసవి సెలవులను ప్రకటించనున్నట్లు సమాచారం. వీరికి ఈ నెల 27వ తేదీతో పరీక్షలు ముగియనుండగా.. మరో రెండు రోజులు ఫలితాలు వెల్లడి, పేరెంట్స్ మీటింగ్స్ మొదలైనవి ఉంటాయి. అవి పూర్తి కాగానే వేసవి సెలవులను ప్రకటించనున్నారని ఈ నెల 30 నుంచి స్కూల్స్‌కు సెలవులు ఇచ్చే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ ద్వారా అనధికారికంగా తెలిసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రమంతటా పగటి ఉష్ణోగ్రతలు అధికం అవుతుండటంతో.. ఈ సెలవులు షెడ్యూల్ కాస్త ముందుకు జరిగే ఛాన్స్ ఉందట. కాగా, 2023-24 విద్యా సంవత్సరానికి గానూ స్కూల్స్ మళ్లీ తిరిగి జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి ఏపీ విద్యార్ధులకు సుమారు 45 రోజుల పాటు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.


Also Read:


వేసవి సెలవుల్లో విద్యార్థులకు వినూత్న కార్యక్రమం, పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు!
వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెలవుల్లో ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ అనే కార్యక్రమాన్ని అమలు చేయాలని  పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 19న ఆదేశాలు జారీచేసింది. ఈ కార్యక్రమాన్ని మే 1 నుంచి జూన్‌ 10 వరకు అమలు చేయాలని సూచించింది. ఉపాధ్యాయులు, అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆదేశించింది. పాఠశాలలోని విద్యార్థులను బృందాలుగా విభజించి ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలని, వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసి, రోజువారీగా కథలను పోస్ట్‌ చేయాలని ఆదేశించింది. ఆ కథలు చదివాక విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని పేర్కొంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నవోదయ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే పరీక్షకు అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 29న జరిగే ఈ పరీక్షకు జనవరి 31వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.  ఈ పరీక్షకు గడువు సమీపిస్తున్న వేళ తాజాగా హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష ఏప్రిల్‌ 29న ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫలితాలను జూన్‌లోపు విడుదల చేసే అవకాశం ఉంది. అడ్మిట్‌ కార్డులు పొందాలంటే విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 
హాల్‌టికెట్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..