ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్(Intermediate) పరీక్షలు వాయిదా(Postpone) పడ్డాయి. పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్(Adimulapu Suresh) ప్రకటించారు. కొత్త తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. జేఈఈ మెయిన్స్(JEE Mains) కారణంగా ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి. గతంలో విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్‌ పరీక్షలను ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రెండు రోజుల కిందట ప్రకటించింది. దీంతో పరీక్షలను వాయిదా వేసినట్లు  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ గురువారం తెలిపారు.


ఇంటర్ ప్రాక్టికల్స్ ఎప్పుడంటే?


ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు మార్చి 11 నుంచి మార్చి 31వరకు జరుగుతాయని మంత్రి సురేశ్‌ తెలిపారు. కోవిడ్(Covid) నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు(Inter Board) తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,400 పరీక్షా కేంద్రాలు, 900 ల్యాబ్‌లను పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి వెల్లడించారు. 



Also Read: Telangana Inter Exams 2022: అలర్ట్! తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో మార్పు, కొత్త షెడ్యూల్ ఇదే


ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ 


ఏపీలో మొత్తం 6,39,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. 



  • మే 02(సోమవారం)- ఫస్ట్‌ లాంగ్వేజ్



  • మే 04(బుధవారం )- సెకండ్‌ లాంగ్వేజ్



  • మే 05(గురువారం)-ఇంగ్లీష్‌

  • మే 07(శనివారం)- గణితం

  • మే 09(సోమవారం)-ఫిజికల్ సైన్స్

  • మే 10(మంగళవారం)బయోలాజికల్ సైన్స్

  • మే 11(బుధవారం)సోషల్ స్టడీస్

  • మే 12(గురువారం) ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్‌ 2(కాంపోజిట్ కోర్స్‌/ఓఎస్‌ఎస్‌సీఎన్ఈన్‌ లాంగ్వేజ్)  పేపర్‌ 1 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్)

  • మే 13(శుక్రవారం) ఓఎస్‌ఎస్‌సీఎన్ఈన్‌ లాంగ్వేజ్ పేపర్‌ 2(సంస్కృతం, అరబిక్‌, పర్షియన్)/ ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్స్‌ థియరీ


 Also Read: Inter Exam Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు