ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 26) విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సాయంత్రం 6 గంటలకు ఫలితాలనున విడుదల చేశారు. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ సెకండియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75% ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటిస్థానంలో, 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా మూడోస్థానంలో నిలిచింది.
ఏపీ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఏపీ ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ ఫలితాలు ఇలా చూసుకోండి..
స్టెప్-1: ఇంటర్ ఫలితాలు విడుదల కాగానే అభ్యర్థులు https://bie.ap.gov.in/ లేదా https://examresults.ap.nic.in వెబ్‌సైట్లను సందర్శించాలి.
స్టెప్-2: తర్వాత ఆయా వెబ్‌సైట్‌లోని హోంపేజీలో ఫలితాలకు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
స్టెప్-3: ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయగానే లాగిన్‌తో కూడిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్-4: లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్ నమోదు చేయాలి.
స్టెప్-5: తర్వాత 'SUBMIT' బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫలితాలు కంప్యూటర్ హోం స్క్రీన్‌పై కనిపిస్తాయి.
స్టెప్-6: ఫలితాల కాపీని ప్రింట్ తీసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2022-2023 అకడమిక్ ఇయర్ గాను ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ పరీక్ష కేంద్రాల్లో మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు నిర్వహించింది. మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 3న ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 4న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్ సెకండియర్ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. వీరిలో 9,20,552 మంది రెగ్యులర్, 83,749 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు.
Also Read:
వేసవి సెలవుల్లోనూ క్లాసులు, ఇంటర్ బోర్డు ఆదేశాలు బేఖాతరు!
ఏపీలో ఒకవైపు ఇంటర్మీడియట్ కళాశాలలను జూన్ ఒకటి వరకు ప్రారంభించొద్దని, ఎలాంటి తరగతులు నిర్వహించరాదని ఇంటర్ విద్యామండలి ఆదేశించింది. ప్రవేశాలను సైతం నిర్వహించొద్దని సూచించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు కార్పొరేట్ కాలేజీలు ఇవేమీ పట్టడం లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వేసవి సెలవుల్లోనూ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుండే అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించారు. వాస్తవానికి ఫిబ్రవరి నుండే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు పోటీపడేవారు కార్పొరేట్ కాలేజీల్లో ముందే ప్రవేశాలు తీసుకుంటున్నారు. ముందుగా రూ.10,000 ఫీజు కట్టి అడ్మిషన్ ఖరారు చేసుకుంటున్నారు. నిబంధనలు పేరుకే ఉన్నాయి కానీ కార్పొరేట్ కాలేజీలకు కళ్లెం వేయలేకపోతున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..