AP Inter Hall Tickets Released: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల హాట్ టికెట్లను రాష్ట్ర బోర్డ్ విడుదల చేసింది. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు మార్చి 11 నుంచి మార్చి 31వరకు జరుగుతాయని ఇదివరకే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ఏపీ ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు వచ్చేశాయ్. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు (AP Inter 2nd Year Hall tickets 2022) డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 


ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్(Intermediate) పరీక్షలు ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు జరుగనున్నాయి. గతంలో విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్‌ పరీక్షలను ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రెండు రోజుల కిందట ప్రకటించింది. దీంతో పరీక్షలను వాయిదా వేసినట్లు  విద్యాశాఖ మంత్రి ఇటీవల తెలిపారు.    
ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ 


ఇంటర్ ప్రాక్టికల్స్ తేదీలివే..  
ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు మార్చి 11 నుంచి మార్చి 31వరకు జరుగుతాయని మంత్రి సురేశ్‌ తెలిపారు. కోవిడ్(Covid) నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు(Inter Board) తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,400 పరీక్షా కేంద్రాలు, 900 ల్యాబ్‌లను పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి వెల్లడించారు. 


ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Step 1: మొదట ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి 
Step 2: హోం పేజీలో కనిపిస్తున్న Download Practical Hall Tickets March 2022 మీద క్లిక్ చేయాలి
Step 3: ఓపెన్ అయిన కొత్త పేజీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్‌కు రోల్ నెంబర్ లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ (Aadhar Number)గానీ నమోదు చేయాలి
Step 4: ఆ తరువాత డౌన్‌లోడ్ హాల్ టికెట్ (Download Hall Ticket) ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
Step 4: స్క్రీన్ మీద మీ హాల్ టికెట్ కనిపిస్తుంది. దాన్ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్‌ను విద్యార్థులు ప్రింట్ తీసుకోవాలని అధికారులు సూచించారు


Also Read: AP Inter Exams 2022: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలివే?


Also Read: Inter Exam Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు