AP ICET 2024 Results Today: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 6న నిర్వహించిన APICET -2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు నేడు (మే 30) వెలువడనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఐసెట్ ఫలితాలను వెల్లడించనున్నట్లు ఐసెట్ కన్వీనర్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలను చూసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులు అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు అవసరమైన వివరాలు నమోదుచేసి ఫలితాలు, ర్యాంకు కార్డులు పొందవచ్చు.
ఈ ఏడాది ఐసెట్ పరీక్షకు మొత్తం 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 18,890 మంది బాలురు, 29,938 మంది బాలికలు ఉన్నారు. పరీక్షకు మొత్తం 44,446 మంది (91 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. మే 8న ఐసెట్ ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి మే 10 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఫలితాలను మే 30న విడుదల చేయనున్నారు.
AP ICET 2024 ఫలితాలు ఇలా చూసుకోండి..
Step 1: ఏపీ ఐసెట్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx
Step 2: అక్కడ హోంపేజీలో కిందిభాగంలో కనిపించే AP ICET 2024 Results లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి.
Step 4: ఐసెట్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
Step 5: ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్.. (Link 1)
ఫలితాల కోసం క్లిక్ చేయండి.. (Link 2)
పరీక్ష విధానం..
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-సి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-55 ప్రశ్నలు-55 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు (రెండున్నర గంటలు).
అర్హత మార్కులు..
పరీక్షలో కనీస అర్హత మార్కులను 25% (50 మార్కులు)గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 3న వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. విద్యార్థుల నుంచి ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 7 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 8 నుంచి 12 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 నుంచి 17 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23 నుంచి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6న ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను ఇప్పటికే విడుదల చేయగా.. మే 30న ఫలితాలను వెల్లడించనున్నారు.