APICET 2024 Halltickets: ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2024 పరీక్ష హాల్‌టికెట్లను (AP ICET Admit Card) శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మే 2న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, డిగ్రీ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 6, 7 తేదీల్లో ఏపీ ఐసెట్-2024 ప్రవేశపరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. మే 8న ప్రిలిమినరీ కీ, జూన్ 20న ఐసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఏపీఐసెట్‌లో ర్యాంకు ద్వారా 2024 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(SKU) ఐసెట్ పరీక్షల బాధ్యత నిర్వహిస్తోంది.
APICET 2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం..
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-సి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-55 ప్రశ్నలు-55 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు (రెండున్నర గంటలు).
ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 3న వెలువడిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించారు. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లించారు. ఇక రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 8 నుంచి 12 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 నుంచి 17, రూ.3000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 నుంచి 22 వరకు, అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో అవకాశం కల్పించారు. తాజాగా పరీక్ష హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. మే 6, 7 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఏపీ ఐసెట్-2024 ముఖ్యమైన తేదీలు:
► ఏపీఐసెట్-2024 నోటిఫికేషన్: 03.03.2024.
► దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 06.03.2024.
► దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 07.04.2024.
► రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 08.04.2024 - 12.04.2024.
► రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 13.04.2024 - 17.04.2024.
► రూ.3000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 18.04.2024 - 22.04.2024.
► రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 23.04.2024 - 27.04.2024.
► దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం: 28.04.2024 - 29.04.2024.
► పరీక్ష హాల్‌టికెట్లు: 02.05.2024 నుంచి అందుబాటులో.
► ఏపీ ఐసెట్ పరీక్ష నిర్వహణ: 06.05.2024, 07.05.2024 తేదీల్లో.
పరీక్ష సమయం: 09.00 AM - 11.30AM, 02.30 PM to 05.00 PM
► ప్రిలిమినరీ ఆన్సర్ కీ: 08.05.2024 – 06.00 PM
► ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 10.05.2024 – 06.00 PM
► ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాల వెల్లడి: 20.06.2024