ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే  'ఏపీ ఐసెట్‌' పరీక్షను మే 24న‌ నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షల కోసం ఏపీలో 109 కేంద్రాలు, తెలంగాణలో రెండు చోట్ల పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మే 24న ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 


పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయానికి గంటన్నర ముందునుంచే  విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ ఏడాది ఐసెట్ పరీక్షకు మొత్తం 49,162 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హాల్‌టికెట్‌లో పొరపాట్లుంటే హెల్ప్‌లైన్‌ కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చు.  ఏపీఐసెట్‌లో ర్యాంకు ద్వారా 2023 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఐసెట్ పరీక్షల బాధ్యత నిర్వహిస్తోంది.


ఐసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 


పరీక్ష విధానం: 
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-సి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-55 ప్రశ్నలు-55 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు (రెండున్నర గంటలు).


ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2023 నోటిఫికేషన్ మార్చి 17న వెలువడిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించారు. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లించారు. అయితే రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో మే 4 నుంచి మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో మే 11 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు మే 16, 17 తేదీల్లో అవకాశం కల్పించారు. తాజాగా పరీక్ష హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. మే 24, 25 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 


Notification


Also Read:


మే 25 నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌, ముఖ్యమైన తేదీలివే!
పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు మే 25 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి మే 22న‌ ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 25 నుంచి జూన్‌ 1 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. మే 29 నుంచి జూన్‌ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. జూన్‌ 1 నుంచి 6 వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్‌ 7న వెబ్‌ఆప్షన్లలో మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక జూన్ 9న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులకు జూన్ 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


నిఫ్టెమ్‌లో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సులు - వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన హరియాణా(సోనిపట్‌)లోని ''నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్‌ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (నిఫ్టెమ్‌)'' సంస్థ 2023-2024 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించాను. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించి, దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..