యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ మే 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది అభ్యర్థులు యూపీఎస్సీ ఎంపికచేసింది. కేటగిరీలవారీగా జనరల్-345, ఈడబ్ల్యూఎస్-99, ఓబీసీ-263, ఎస్సీ-154, ఎస్టీ-72 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇక సర్వీసులవారీగా చూస్తే.. ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్‌ఎస్-38 మంది, ఐపీఎస్-200 మంది, సెంట్రల్ సర్వీసెస్-ఎ-473 మంది, గ్రూప్-బి సర్వీసులకు 131 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.


మొదటి 4 ర్యాంకులు అమ్మాయిలవే.. 
 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో అమ్మాయిలు మరోసారి సత్తాచాటారు. మొదటి నాలుగు ర్యాంకులను అమ్మాయిలే సాధించడం విశేషం. వీరిలో ఇషితా కిశోర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో మెరవగా.. గరిమ లోహియా, ఉమా హారతి ఎన్. స్మృతి మిశ్రా తర్వాతి నాలుగు ర్యాంకుల్లో నిలిచి సత్తాచాటారు.


టాపర్స్ వీళ్లే ..


1వ ర్యాంకు - ఇషితా కిశోర్
2వ ర్యాంకు -  గరిమా లోహియా
3వ ర్యాంకు - ఉమా హార్తి ఎన్
4వ ర్యాంకు - స్మృతి మిశ్రా
5వ ర్యాంకు - మయూర్ హజారికా
6వ ర్యాంకు - గెహ్నా నవ్య జేమ్స్
7వ ర్యాంకు - వసీం అహ్మద్ భట్
8వ ర్యాంకు - అనిరుధ్ యాదవ్
9వ ర్యాంకు - కనికా గోయల్
10వ ర్యాంకు - రాహుల్ శ్రీవాస్
11వ ర్యాంకు - పర్సంజీత్ కౌర్
12వ ర్యాంకు - అభినవ్ సివాచ్
13వ ర్యాంకు - విదుషి సింగ్ 
14వ ర్యాంకు - కృతికా గోయల్
15వ ర్యాంకు - స్వాతి శర్మ
16వ ర్యాంకు - శిశిర్ కుమార్ సింగ్
17వ ర్యాంకు - అవినాష్ కుమార్ 
18వ ర్యాంకు - సిద్ధార్థ్ శుక్లా
19వ ర్యాంకు - లఘిమా తివారీ
20వ ర్యాంకు - అనుష్క శర్మ
21వ ర్యాంకు - శివమ్ యాదవ్
22వ ర్యాంకు - జివి ఎస్ పవన్ దత్తా
23వ ర్యాంకు - వైశాలి
24వ ర్యాంకు - సందీప్ కుమార్
25వ ర్యాంకు - సంఖే కశ్మీరా కిషోర్
26వ ర్యాంకు - గుంజిత అగర్వాల్
27వ ర్యాంకు - యాదవ్ సూర్యభాన్ అచ్చెలాల్
28వ ర్యాంకు - అంకితా పువార్
29వ ర్యాంకు - పౌరుష్ సూద్
30వ ర్యాంకు - ప్రేక్ష అగర్వాల్
31వ ర్యాంకు - ప్రియాన్షా గార్గ్
32వ ర్యాంకు - నితిన్ సింగ్ 
33వ ర్యాంకు - తరుణ్ పట్నాయక్ మదాలా
34వ ర్యాంకు - అనుభవ్ సింగ్
35వ ర్యాంకు - అజ్మీరా సంకేత్ కుమార్
36వ ర్యాంకు - ఆర్య వీఎం
37వ ర్యాంకు - చైతన్య అవస్థి
38వ ర్యాంకు - అనూప్ దాస్
39వ ర్యాంకు - గరిమా నరులా
40వ ర్యాంకు - సాయి 


తెలుగు తేజాల హవా..
సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అదరగొట్టారు. వీరిలో జీవీఎస్ పవన్ దత్తా 22 ర్యాంకుతో మెరవగా.. శాఖమూరి శ్రీసాయి అర్షిత్ 40వ ర్యాంకు, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంకు, అనుగు శివమారుతీరెడ్డి 132వ ర్యాంకు, రాళ్లపల్లి వసంతకుమార్ 157వ ర్యాంకు, కమతం మహేశ్ కుమార్ 200వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 217వ ర్యాంకు, బొల్లం ఉమామహేశ్వర్ రెడ్డి 270వ ర్యాంకు, చల్లా కల్యాణి 285వ ర్యాంకు, పాలువాయి విష్ణువర్దన్ రెడ్డి 292వ ర్యాంకు, గ్రంథె సాయికృష్ణ 293వ ర్యాంకు, వీరగంధం లక్ష్మి సుజిత 311వ ర్యాంకు, ఎన్. చేతనారెడ్డి 346వ ర్యాంకు, శృతి యారగట్టి 362వ ర్యాంకు, యప్పలపల్లి సుష్మిత 384వ ర్యాంకు, సీహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి 426వ ర్యాంకు, బొల్లిపల్లి వినూత్న 462 ర్యాంకులతో సత్తా చాటారు.


యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు ఇలా చూసుకోండి..


1. ఫలితాల కోసం అభ్యర్థులు మొదట వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- upsc.gov.in


2.  అక్కడ హోంపేజీలో కనిపించే 'యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్  తుది ఫలితాలకు సంబంధించిన లింకు పై క్లిక్ చేయాలి.


3. పీడీఎఫ్ ఫార్మాట్‌లో సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా స్కీన్ మీద కనిపిస్తుంది.


4. పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని, జాబితాలో అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. 


ఫలితాల కోసం క్లిక్ చేయండి..


సర్వీసులవారీగా ఎంపిక ఇలా..




సివిల్స్ మెయిన్-2022 పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 6న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలు ముగిసిన నేపథ్యంలో తాజాగా తుది ఫలితాలను యూపీఎస్సీ వెల్లడించింది.


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిన్ జూన్ 25న 72 నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటి ఫలితాలను జూన్ 22న వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 16 నుండి 25 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 11,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో తెలంగాణ నుంచి 673 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హైదరాబాద్‌లో మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.


యూపీఎస్‌సీ ఈ ఏడాది 1011 ఖాళీల భర్తీకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది కంటే ఈసారి 300 పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే 2021లో ప్రకటించిన ఖాళీలు చాలా తక్కువ. సివిల్ సర్వీసెస్ పరీక్ష నుంచి రైల్వే సర్వీసెస్‌ను తొలగించడం వల్ల ఇలా ఖాళీల సంఖ్య తగ్గింది. ఈ సంవత్సరం వాస్తవంగా ప్రకటించిన ఖాళీలు 861. ఆ తర్వాత రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు చెందిన 150 ఖాళీలను ప్రభుత్వం జోడించడంతో మొత్తం 1011 ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో గతేడాదితో పోలిస్తే ఖాళీలు 42 శాతం పెరిగాయి.


ALso  Read:


యూపీఎస్సీ ఎన్డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (II)-2023 నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తు ప్రారంభం!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)& నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ (II)- 2023'కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి ఏప్రిల్ 16న రాతపరీక్ష నిర్వహించింది. ఇక ద్వితియార్ధానికి సంబంధించి సెప్టెంబరు 3న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సీడీఎస్ ఎగ్జామినేష‌న్ (II) - 2023 నోటిఫికేషన్ విడుదల - త్రివిధ దళాల్లో 349 ఖాళీలు!
కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేష‌న్(II)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మే 17న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత ప‌రీక్ష ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అర్హులైన అభ్యర్థులు మే 17 నుంచి జూన్ 6 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..