AP ICET 2022 : ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల అర్హత పరీక్ష ఐసెట్ నోటిఫికేషన్‌ సెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎన్‌. కిషోర్‌బాబు శనివారం విడుదల చేశారు. జూన్‌ 10వ తేదీ వరకు అప్లికేషన్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అపరాధ రుసుంతో జులై 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని సెట్ కన్వీనర్ తెలిపారు. జులై 25న రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఐసెట్ పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడానికి ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in సందర్శించాలని సూచించారు. 


ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ AP ICET నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్( AP ICET 2022) రిజిస్ట్రేషన్లు మే 14, 2022 ప్రారంభం అయ్యాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు AP ICET నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి. ముఖ్యమైన తేదీల జాబితా, దరఖాస్తు చేసే విధానం కింద పేర్కొన్నారు. 



  1. రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ అయింది. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు

  2. అప్లికేషన్లు నమోదు చేసుకోవడానికి గడువు జూన్ 10, 2022తో ముగుస్తుంది

  3. జులై 25, 2022న పరీక్ష నిర్విహస్తారు


AP ICET 2022 దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసేందుకు ఆలస్య రుసుము చెల్లించకుండా జూన్ 10 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు జరిమానా చెల్లించి తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 25న పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తారు. 



  •  ఆసక్తిగల అభ్యర్థులు ఏపీ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్‌ cets.apsche.ap.gov.in కు వెళ్లాలి.

  • హోమ్‌పేజీలో, 'స్టెప్ 1 ఫీజు చెల్లింపు' లింక్‌పై క్లిక్ చేసి, ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించండి

  • చెల్లింపు తర్వాత, స్టేటస్ తనిఖీ చేసి, ఆపై దరఖాస్తు ఫారమ్‌ను ప్రారంభించాలి

  • అన్ని వివరాలు పూర్తి చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. చివరిగా సమర్పించుపై క్లిక్ చేయండి

  • అప్లికేషన్ ను పేజీ ప్రింట్ అవుట్ తీసుకోండి


ఏపీ ఎడ్ సెట్ 2022 నోటిఫికేషన్ 


ఏపీ ఎడ్ సెట్ 2022 నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌ అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎడ్ సెట్ నోఫికేషన్ ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌  అముదవల్లి శుక్రవారం విడుదల చేశారు. అర్హత పరీక్షకు మే 9 నుంచి జూన్‌ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు రుజుం ఓసీ అభ్యర్థులకు రూ.650, బీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. ఎడ్ సెట్ పరీక్షను జులై 13న నిర్వహించనున్నారు. బీఈడీ, స్పెషల్ బీఈడీ చేసేందుకు బీఏ లేదా బీఎస్సీ లేదా బీకాం లేదా బీసీఏ లేదా బీబీఎం కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో పాస్ అవ్వాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం cets.apsche.ap.gov.in లో విజిట్ చేయండి.