AP EDCET 2023 Counselling: ఏపీలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌ నిర్వహణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. హైకోర్టు ఆదేశాలతో బీఈడీ కౌన్సెలింగ్‌ షెడ్యూలును ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ రామమోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది జులై 14న బీఈడీ ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్‌ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెల్లడై 6 నెలలు గడిచినా కౌన్సెలింగ్‌ నిర్వహించలేదు. దీంతో కళాశాల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. రాష్ట్రవ్యాప్తంగా 411 బీఈడీ కళాశాలలు ఉండగా, వీటిల్లో 34 వేలకుపైగా సీట్లున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్‌ ట్రైనింగ్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రవేశపరీక్షను జూన్ 14న ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్ష నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 77 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.  పరీక్షకు 13,672 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,235 (82.17 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను జులై 14న విడుదల చేయగా.. ఫలితాల్లో మొత్తం 10,908 (97.08 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 


ఆంధ్రప్రదేశ్‌లో 18 బీఈడీ కళాశాలలకు అనుమతులు నిలిపివేస్తూ ఉన్నత విద్యాశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఫీజులు నిర్ణయించని కారణంగా వాటిని కౌన్సెలింగ్‌ జాబితా నుంచి తొలగించారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 30 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా.. వాయిదా వేశారు. దాంతో కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం జరిగింది. తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు విడుదల చేశారు.


గతేడాది కూడా కౌన్సెలింగ్ ప్రక్రియ ఇలానే ఆలస్యం కావడంతో విద్యార్థులు దాదాపు ఏడాది సమయం కోల్పోయారు. ఇప్పుడు అక్టోబరు వచ్చినా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. అది ఇలాగే కొనసాగితే ఈసారీ విద్యార్థులు విలువైన సమయాన్ని కోల్పోయే అవకాశం ఉంది.


ALSO READ:


APSWREIS: డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్
తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మార్చిలో జరిగే పదోతరగతి పరీక్షలో అర్హత సాధించాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు. అర్హులైన బాలబాలికలు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 23లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఒకసారి దరఖాస్తు అప్‌లోడ్ చేసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వివరాల్లో మార్పులకు అవకాశం ఉండదు. కాబట్టి వివరాలు జాగ్రత్తగా నమోదుచేయాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...