Telugu News Today: జగన్ పార్టీలో వైఎస్‌ఆర్ లేరు ఉన్నది ఆ ముగ్గురే- యుద్ధానికి "సిద్ధం"- చేతనైంది చేసుకోండి- వైసీపీకి షర్మిల సవాల్
ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వైసీపీపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్నది YSR కాంగ్రెస్ పార్టీ కాదని... Y అంటే YV సుబ్బారెడ్డి అని... S అంటే సాయిరెడ్డి...R అంటే రామకృష్ణా రెడ్డి... అన్నారు. ఆ పార్టీలో వైఎస్‌ఆర్ లేరని అన్నారు. మీది జగన్ రెడ్డి పార్టీ..నియంత పార్టీ...ప్రజలను పట్టించుకోని పార్టీ అంటు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ...వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వైసీపీ భీమిలి బహిరంగ సభ వద్ద చంద్రబాబు, పవన్ కటౌట్‌లు
విశాఖలోని భీమిలి వేదిక నుంచి 2024 ఎన్నికల శంకారావం పూరించనున్న వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరిగా తరలి వస్తున్నారు. అయితే సభా వేదిక వద్ద ప్రతిపక్షాల నేతల కటౌట్‌లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీపీఐ నేత రామకృష్ణ ఇలా తమకను నిత్యం విమర్శించే వారి కటౌట్‌ను వేదిక మొత్తం పెడుతున్నారు. వారిని వికృతంగా చూపిస్తూ ఈ కటౌట్‌లు పెట్టారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ విద్యా శాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం? - త్వరలోనే అధికారిక ప్రకటన!
తెలంగాణ నూతన విద్యా శాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయనకు రేవంత్ సర్కార్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఈ క్రమంలో త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ఈ పదవి అప్పగించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి విన్నవించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఫిబ్రవరిలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా, కొందరు సిట్టింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్ఎస్ (BRS)...వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో (Loksabha Elections ) మెజార్టీ సీట్లు సాధించేలా వ్యూహాలు రూపొందిస్తోంది. ఎక్కువ ఎంపీ సీట్లు గెలుపొందడం సమీక్షలు మీద సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr )...ప్రస్తుతం శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలు ముగిసేలోపే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టీడీపీ-జనసేన కూటమి సీట్ల పంపకాల టైంలో జగడం తప్పదా..?
రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. వైసీపీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు పార్టీలతోపాటు బీజేపీని కూడా కూటమిలో చేర్చుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్ని సవ్యంగా సాగితే మరో రెండు వారాల్లో కూటమిపై స్పష్టత వస్తుంది. బీజేపీని కూటమిలో చేర్చే విషయంపై తుది చర్చలు జరిపేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి