ఏపీలోని పాలిటెక్నిక్ విద్యార్థులకు బీటెక్‌లో ప్రవేశాలకు ప్రభుత్వం బ్రేక్ వేసేలా కనిపిస్తోంది. పాలిటెక్నిక్ తర్వాత ఏడాది తప్పనిసరిగా పరిశ్రమలో పని చేయాలనే కొత్త నిబంధన తీసుకురానుండటమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సాంకేతిక విద్యాశాఖ  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కొత్త విధానం ప్రకారం మూడేళ్ల పాలిటెక్నిక్ విద్య పూర్తిచేసుకున్న తర్వాత, నాలుగో ఏడాది తప్పనిసరిగా పరిశ్రమలో పని చేయాల్సి వస్తుంది. దీంతో పాలిటెక్నిక్ ఇక నాలుగేళ్ల కోర్సుగా మారిపోతుంది. ఏటా పాలిటెక్నిక్ నుంచి 35 వేల మంది ఉత్తీర్ణత సాధిస్తుంటే వీరిలో 85 శాతం మంది ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈసెట్) ద్వారా బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశం పొందుతున్నారు.


పాలిటెక్నిక్ అర్హతతో ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో పాలిటెక్నిక్ తర్వాత బీటెక్‌కు నేరుగా వెళ్లకుండా మధ్యలో ఏడాది పరిశ్రమలో పని చేసేలా నిబంధన తెస్తే పరిశ్రమలోనే ఉండిపోతారనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. విద్యార్థి దశలో ప్రతి ఏడాది ఎంతో విలువైన సమయం. ఉన్నత చదువులకు వెళ్లిపోతున్నారనే కారణంతో ఏడాది సమయాన్ని ఎలా వృథా చేస్తారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. 


అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకారం పాలిటెక్నిక్ తర్వాత బీటెక్‌లో ప్రవేశాలు పొందొచ్చు. దీని ప్రకారమే విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్తున్నారు. కానీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ఆలోచిస్తోంది. విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించి, మెరుగైన వేతనాలు లభిస్తే పాలిటెక్నిక్‌తోనే ఉద్యోగాల్లో చేరతారు. కానీ, ఇవేమి పట్టించుకోకుండా పరిశ్రమల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల అవసరం ఉందని, వారు బీటెక్‌కు వెళ్లిపోవడం వల్ల సూపర్ వైజర్లు లభించడం లేదని అధికారులు వింత వాదనలు తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Also Read:


ఏపీ పాలిసెట్‌ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
రాష్ట్రంలోని వివిధ పాలిటెక్నిక్‌లలో ఇంజనీరింగ్‌, నాన్‌-ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించబడే పాలిసెట్‌ 2023 దరఖాస్తుల ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్‌పర్సన్‌ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. సాంకేతిక విద్యాశాఖ కమీషనర్‌ కార్యాలయంలో గురువారం (ఫిబ్రవరి 17) జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వివరాలతో కూడిన కరపత్రం ఆవిష్కరణ, ఆన్‌‌లైన్‌‌లో నమూనా దరఖాస్తు నింపటం ద్వారా నూతన విద్యా సంవత్సర పాలిటెక్నిక్‌ ఆడ్మిషన్ల ప్రక్రియకు నాంది పలికారు. పాలీసెట్‌-2023 దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్‌ 30 కాగా, పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా మే 10న నిర్వహించనున్నామని ఈ సందర్భంగా నాగరాణి పేర్కొన్నారు.
పాలిసెట్ దరఖాస్తు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లి్క్ చేయండి..


టీఎస్ పాలిసెట్‌-2023 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు వివరాలు ఇలా!
తెలంగాణలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్-2023 నోటిఫికేషన్ జనవరి 11న వెలువడింది. వచ్చే విద్యాసంవత్సరానికి టీఎస్‌ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష మే 17న నిర్వహించనున్నారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనవరి 16 నుంచి  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. విద్యార్థులు ఏప్రిల్‌ 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 25 వకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
పాలిసెట్ దరఖాస్తు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లి్క్ చేయండి.. 


పాలిటెక్నిక్ ఫెయిలైన వాళ్లకు గుడ్ న్యూస్, ఇప్పుడు పరీక్ష రాసి పాస్‌ కావొచ్చు - 1990 నుంచి ఇప్పటిదాకా!
రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ఇంత వరకు పాస్‌ కాలేకపోయిన వారికి ప్రభుత్వం తీపికబురు వినిపించింది. 1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్‌ అయిన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇలాంటి వారికి ఈ ఏడాది జూన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్‌ సీ శ్రీనాథ్‌ మార్చి 8న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను విడుదల చేశారు. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించడానికి ఏప్రిల్‌ 10 చివరితేదీగా నిర్ణయించారు. ఇక రూ.400 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 14 వరకు, తత్కాల్‌ స్కీం కింద ఎగ్జామ్‌ ఫీజుతో పాటు మరో రూ.6,000 అదనంగా కలిపి ఏప్రిల్‌ 15 వరకు చెల్లించడానికి అవకాశం కల్పించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..