AP EDCET- 2024 Results: ఏపీలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌ (Andhra Pradesh Education Common Entrance Test )-2024' ఫలితాలు జులై 27న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలతోపాటు, ర్యాంకు కార్డులు అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబరు, ఎడ్‌సెట్ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ నెంబరు, ఎడ్‌సెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


మొత్తం 150 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా (37 మార్కులు) నిర్ణయించారు. ర్యాంకుల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. అలాగే ఫిజికల్ సైన్సెస్/మ్యాథమెటిక్స్ మెథడాలజీ విభాగాలకు సంబంధించి మహిళలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. ఈ కనీస మార్కుల ఆధారంగా ఎడ్‌సెట్ ర్యాంకులు కేటాయించారు. 


ఏపీ ఎడ్‌సెట్-2024 ఫలితాలు ఇలా చూసుకోండి..
➥ ఎడ్‌సెట్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx
➥ అక్కడ హోంపేజీలో ఎడ్‌సెట్ ఫలితాలకు సంబంధించి 'Results' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ ఎడ్‌సెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేయాలి.
➥ తర్వాత 'View Results' బటన్‌ మీద క్లిక్ చేయాలి.
➥ ఎడ్‌సెట్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి
➥ ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకోవచ్చు.


AP EDCET 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఏపీ ఎడ్‌సెట్-2024 ర్యాంకు కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ ఎడ్‌సెట్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx
➥ అక్కడ హోంపేజీలో ఎడ్‌సెట్ ర్యాంకు కార్డుకు సంబంధించి 'Download Rank Card' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ ఎడ్‌సెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎడ్‌సెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు వివరాలు నమోదుచేయాలి.
➥ తర్వాత 'View Rank Card' బటన్‌ మీద క్లిక్ చేయాలి.
➥ ఎడ్‌సెట్ ర్యాంకు కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
➥ అభ్యర్థులు ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.


AP EDCET 2024 ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..


ఏపీలోని ఎడ్‌సెట్ కళాశాలల్లో బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రా యూనివర్సిటీ ఏప్రిల్ 16న నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 18 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆలస్య రుసుముతో మే 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల సవరణకు మే 22 నుంచి మే 25 వరకు అవకాశం కల్పించారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 30న విడుదలచేశారు. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 8న ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 9365 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని జూన్ 15న విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి జూన్ 18 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఎడ్‌సెట్ ఫలితాలను జూన్ 27న  ప్రకటించారు. ఫలితాలతోపాటు ర్యాంకు కార్డులను కూడా విడుదల చేశారు.



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..