AP EdCET 2024 Exam Date: ఆంధ్రప్రదేశ్‌‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి జూన్ 8న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు ఏపీ ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 30 నుంచి ఎడ్‌సెట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.


ఎడ్‌సెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 15న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే జూన్ 18న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఆ తర్వాత ఫైనల్ కీతోపాటు ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేస్తారు. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష బాధ్యత నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.


పరీక్ష విధానం:


➥ మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 120 నిమిషాలు. 


➥ పరీక్షలో మొత్తం మూడు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-25 మార్కులు, పార్ట్-బి: జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు-15 మార్కులు, టెక్నికల్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-సిలో మెథడాలజీ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. మెథడాలజీలో అభ్యర్థులు ఎంపికచేసుకునే సబ్జె్క్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.


➥ మెథడాలజీలోలో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ (జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్), ఇంగ్లిష్ సబ్జె్క్టులు ఉంటాయి.


ఆంధ్రప్రదేశ్‌‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 16న 'ఏపీ ఎడ్‌సెట్‌-2024' నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. ఎడ్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 18న ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారి నుంచి మే 15 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు అవకాశం కల్పించింది. అయితే రూ.1000ల ఆలస్య రుసుముతో మే 19 వరకు, రూ.2000ల ఆలస్య రుసుముతో మే 21 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల సవరణ మే 22న ప్రారంభంకాగా.. మే 25 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 8న ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.


ముఖ్యమైన తేదీలు...


➥ నోటిఫికేషన్ వెల్లడి: 16.04.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.04.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.05.2024.


➥ రూ.1000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 19.05.2024.


➥ రూ.2000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 21.05.2024.


➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 22.05.2024  - 25.05.2024.


➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 30.05.2024 నుంచి.
 
➥ ఏపీ ఎడ్‌సెట్-2024 పరీక్ష తేది: 08.06.2024.


పరీక్ష సమయం: మొదటి సెషన్: ఉ.09.00 గం. . ఉ.11.00 గం. వరకు.


➥ ఎడ్‌సెట్ ప్రిలిమినరీ కీ అప్‌లోడ్: 15.06.2024. 11-00 AM 


➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 18.06.2024. 5.00 PM 


AP EDCET 2024 Notification



Online Application


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..