ఏపీ ఎడ్‌సెట్-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఆగస్టు 5 సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాలతోపాటు ఎడ్‌సెట్ ర్యాంకు కార్డులను కూడా ఆయన విడుదల చేశారు. లాసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలతోపాటు, ర్యాంకు కార్డులను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


AP EDCET-2022 Results


AP Ed.CET-2022 Rank Card


బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఏపీఎడ్‌సెట్‌- 2022 జులై 13న రాష్ట్రవ్యాప్తంగా. ఈ పరీక్షకు 13,978 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 11,384 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2,594 మంది అభ్యర్థులు గైర్హాజరు కాగా, 81.44 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 

Also Read: ఏపీ లాసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి! 

ఆంధ్రప్రదేశ్‌ ఎడ్‌సెట్ 2022 పరీక్ష కోసం అభ్యర్థుల నుంచి మే 13 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. పరీక్షలను జులై 13న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా, కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థుల ఆప్షన్ల మేరకు సంబంధిత కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల భర్తీ..
ఎడ్‌సెట్‌ పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు పొందిన మార్కులు, ర్యాంకు, ఎంచుకున్న మెథడాలజీ ఆధారంగా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి.. సీట్ల భర్తీ ప్రక్రియ చేపడతారు. గత ఏడాది కౌన్సెలింగ్‌ గణాంకాల ప్రకారం–ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పరిధిలోని 482 కళాశాలల్లో దాదాపు 35 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 


Also Read: MAT 2022 Notification: మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన మార్గం ‘మ్యాట్’

బీఈడీతో కెరీర్‌..
ఎడ్‌సెట్‌లో ర్యాంకు ఆధారంగా బీఈడీ పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో బోధన రంగంలో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. 

బీఈడీ తర్వాత టెట్‌లో ఉత్తీర్ణత, ఆ తర్వాత డీఎస్సీలోనూ విజయం సాధిస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌లుగా కెరీర్‌ ప్రారంభించొచ్చు.

ఉద్యోగం చేస్తూనే పీజీ కూడా పూర్తి చేస్తే.. భవిష్యత్తులో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్, జూనియర్‌ లెక్చరర్‌ హోదాలకు సైతం చేరుకోవచ్చు.

జాతీయ స్థాయిలో నిర్వహించే సెంట్రల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌)లో అర్హత ఆధారంగా కేంద్రీయ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు వంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా అవకాశం దక్కించుకోవచ్చు.


ఎడ్‌టెక్‌ సెక్టార్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ పోర్టల్స్‌లోనూ ఉపాధ్యాయులుగా కెరీర్‌ సొంతం చేసుకోవచ్చు.


అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. బీటెక్, బీసీఏ, బీబీఎం విద్యార్థులు కూడా అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకున్న వాటి నుంచే ప్రశ్నలు అడుగుతారు.


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..