ఏపీ ఎడ్‌సెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. ఎడ్‌సెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆప్షన్లు నమోదుచేయవచ్చు. ఒకవేళ ఆప్షన్లలో మార్పులు కోరుకునేవారు ఫిబ్రవరి 24న మార్చుకోవచ్చు. వెబ్‌ఆప్షన్ల నమోదు పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 27న సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 లోపు సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.


వెబ్‌ఆప్షన్ల నమోదుకోసం క్లిక్ చేయండి..


కౌన్సెలింగ్ వెబ్‌‌సైట్


కౌన్సెలింగ్ ఇలా..


➥ వెబ్ఆప్షన్ల నమోదు: 17.02.2023 - 23.02.2023.


➥ వెబ్‌ఆప్షన్లలో మార్పులు: 24.02.2023.


➥ సీట్ల కేటాయింపు: 27.02.2023.


➥ సెల్ఫ్ రిపోర్టింగ్: 28.02.2023 - 01.03.2023.


➥ కళాశాలలో రిపోర్టింగ్, తరగతులు ప్రారంభం: 28.02.2023.


Also Read:


JNTU: బీటెక్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌, ఎంటెక్‌ లేకుండానే 'పీహెచ్‌డీ'లోకి!
పీజీ లేకున్నా పీహెచ్‌డీ‌ల్లో ప్రవేశాలకు ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. బీటెక్‌ విద్యార్థులు కూడా రిసెర్చ్‌ వైపు వెళ్లేలా జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బీటెక్‌ నుంచే పీహెచ్‌డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. అదికూడా ఆనర్స్‌ బీటెక్‌ డిగ్రీ పూర్తిచేసిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించాలని వర్సిటీ నిర్ణయించింది. 
పూర్తివివరాలకు క్లిక్ చేయండి..


జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2 పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 7న ప్రారంభం కావాల్సిన దరఖాస్తు ప్రక్రియ.. వారం రోజుల ఆలస్యంగా ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కొత్త అభ్యర్దులతోపాటు మొదటి సెషన్‌ రాసిన అభ్యర్ధుులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..