ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా పలు ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. కోవిడ్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అధికారులు పరీక్ష షెడ్యూళ్లను విడుదల చేస్తున్నారు. నిన్న (సెప్టెంబర్ 17) ఏపీ ఐసెట్ పరీక్ష పూర్తవ్వగా.. మరో రెండు రోజుల్లో ఎడ్‌సెట్‌ పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్‌ ( Education Common Entrance Test) పరీక్షను ఈ నెల 21న నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్‌ కె.విశ్వేశ్వరరావు తెలిపారు. 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.


పరీక్ష సమయానికి గంట ముందు నుంచి అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. ఎగ్జామ్ సెంటరుకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం, తేదీ, సమయం వివరాలను అభ్యర్థులకు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తామని తెలిపారు. ఎడ్‌సెట్‌ పరీక్ష కోసం మొత్తం 15,638 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ సహా మరిన్ని వివరాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు. ఏపీ ఎడ్‌సెట్‌ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


24 నుంచి ఏపీ పీఈసెట్ (AP PECET)
రాష్ట్రవ్యాప్తంగా బీపీఈడీ (B.P.Ed), యూజీడీపీఈడీ (U.G.D.P.Ed) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీఈసెట్ (Physical Education Common Entrance Test) 2021 ప్రవేశ పరీక్షను ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ డాక్టర్ పి.జాన్సన్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు నాగార్జున యూనివర్సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. కోర్సుల్లో ప్రవేశాలకు 1,857 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు పురుష అభ్యర్థులకు.. 27వ తేదీన మహిళా అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ పీఈసెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


ఐసెట్ పరీక్షకు 90.03 శాతం హాజరు
ఏపీలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్ 2021 పరీక్షకు మొదటి రోజు (సెప్టెంబర్ 17) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు. తొలిరోజు 90.03 శాతం మంది హాజరైనట్లు వెల్లడించారు. 


Also Read: AP Degree Admissions: నేటి నుంచి ఏపీలో డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ.. పూర్తి షెడ్యూల్ ఇదే..


Also Read: TSCHE: ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ నోటిఫికేషన్.. తుది గడువు ఎప్పటివరకు అంటే?